చమురు దిగుమతులు పెంచుకునే వ్యూహం
న్యూఢిల్లీ: రష్యాకి చెందిన రాస్‌నెఫ్ట్‌తో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ఓ ఒప్పందంపై సంతకం చేసింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం నేపథ్యంలో మరింత చమురును తక్కువ ధరకే దిగుమతి చేసుకోవాలన్నది ఐవోసీ ప్రయత్నం.
చమురు దిగుమతులు గణనీయంగా పెంచుకునేందుకు తాజా ఒప్పందం ఉపకరిస్తుందని ఐవోసీ ప్రకటించింది. రాస్‌నెఫ్ట్ సీఈవో ఇగోర్ సెచిన్ భారత్ పర్యటనలో భాగంగా ఒప్పందంపై ఇరు సంస్థలు సంతకాలు చేశాయి.