ఫ్లీజ్‌ మోదీజీ!! మమ్మల్ని ఆదుకోండి..భారత్‌కు రష్యా బంపరాఫర్‌!

13 Mar, 2022 13:51 IST|Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఆ దేశ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది. యుద్ధంతో ప్రపంచ దేశాల నుంచి ఎదరవుతున్న ఇబ్బందుల నుంచి ఆర్ధికంగా తమను ఆదుకోవాలంటూ రష్యా భారత్‌ను అర్జిస్తుంది. ఇందులో భాగంగా భారత్‌.. తమ దేశ దేశంలోని ఆయిల్‌, గ్యాస్‌ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 

ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై అమెరికాతో పాటు ఇతర నాటో దేశాలు గుర్రుగా ఉన్నాయి. అందుకే రష్యా నుంచి దిగుమతులపై పూర్తి స్థాయిలో నిషేధం విధించాయి. దీంతో గత రెండు వారాలుగా రష్యా నుంచి ఆయిల్‌ కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. శనివారం ఈ ఏడాది చివరి నాటికి రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేస్తామని జర్మనీ కీలక ప్రకటన చేసింది. ప్రతి రోజు, ప్రతి గంటకు మేము రష్యన్ దిగుమతులకు వీడ్కోలు పలుకుతున్నాంటూ  జర్మన్‌ ఆర్థిక శాఖ మంత్రి రాబర్ట్ హబెక్ ప్రముఖ మీడియా 'ఫ్రాంక్‌ఫర్టర్ ఆల్జెమీన్ జైటుంగ్' కు తెలిపారు.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం..జర్మనీ ప్రస్తుతం చమురులో 3వ వంతు, బొగ్గులో 45శాతం రష్యా నుండి దిగుమతి చేసుకుంటోంది. అయినా సరే ఈ నెల ముగిసే సమయానికి  బొగ్గు కొనుగోళ్లను, సంవత్సరం చివరి నాటికి  చమురు కొనుగోళ్ల నిలిపివేస్తామని మీడియా కు వెల్లడించారు.   

అదే సమయంలో క్రూడాయిల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో పాటు రష్యా వద్ద చమురు ధరలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. రష్యా అమెరికాకు ప్రతిరోజు 7లక్షల బ్యారల్‌ల చమురును ఎగుమతి చేసేది. అంతేకాకుండా, ప్రపంచ చమురు అవసరాల్లో 12శాతం, సహజవాయివుల్లో 16శాతం అవసరాల్ని రష్యా తీరుస్తుంది. ఇప్పుడు ఆ చమురును కొనేవారు లేకపోవడంతో ఆ చమరును భారత్‌కు అతి తక్కువ ధరకే అమ్ముతామంటూ రష్యా..,భారత్‌కు ఆఫర్‌ చేసింది.

ఇప్పటికే రష్యా నుంచి భారత్‌కు చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 1బిలియన్లకు చేరుకున్నాయి. ఇతర దేశాల నిషేదంతో రష్యాలో..భారత్‌ ఆయిల్‌, గ్యాస్‌ పెట్టుబడులు పెట్టాలని ప్రధాని మోదీతో మంతనాలు జరుపుతుంది. భారత్‌ అందుకు అంగీకరిస్తే తాము భారత్‌లో కంపెనీల ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నామంటూ రష్యా ఉప ప్రధాని నోవాక్ భారత్‌ను సంప్రదించారంటూ భారత పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. 

ఒకవేళ రష్యా ఇస్తున్న ఈ ఆఫర్‌కు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. కానీ రష్యాతో స్నేహం కారణంగా అమెరికాతో పాటు నాటో దేశాలకు దూరం కావాల్సి ఉంది. ఇదే అంశంపై ప్రధాని మోదీ వేచి చూసే ధోరణిలో ఉన్నారని ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: 'చిత్ర' విచిత్రమైన కథ..ఆ 'అజ్ఞాత' యోగి కేసులో మరో ఊహించని మలుపు!!

మరిన్ని వార్తలు