Russia-Ukraine War: యుద్దం ఎఫెక్ట్‌తో క్రాష్‌ అవుతున్న మార్కెట్లు.. నవ్వులు పూయిస్తున్న మీమ్స్‌

24 Feb, 2022 11:24 IST|Sakshi

సాధారణ అంశాలకే ప్రభావితమయ్యే స్టాక్‌ మార్కెట్లు. ఉక్రెయిన్‌పై రష్యా చేపడుతున్న దాడులు ప్రతిగా అమెరికా దాని మిత్ర దేశాలు విధిస్తున్న ఆంక్షలతో కకావికాలం అవుతున్నాయి. ఇండియా, సింగపూర్‌, చైనా, అమెరికన్‌ నాస్‌డాక్‌, యూరప్‌, జపాన్‌ ఇలా ఆ దేశం ఈ దేశం అని కాకుండా ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు బాంబుల మోతకు తీవ్రంగా కంపిస్తున్నాయి.  అమ్మకాల ఒత్తిడిలో కూరుకుపోయాయి. క్షణాల వ్యవధిలోనే లక్షల కోట్ల సంపద ఆవిరవుతోంది. ఆలస్యం చేసిన కొద్ది మార్కెట్లు మరింతగా కుంగిపోతుండటంతో ఇన్వెస్టర్లు గగ్గోలు పెడుతున్నారు. 

యుద్ధం ఎఫెక్ట్‌తో ఇన్వెస్టర్లు ఓవైపు కంగారు పడుతుంటే మరోవైపు దొరికిందిరా ఛాన్స్‌ అన్నట్టుగా అప్పటికప్పుడు మీమ్స్‌ తయారు చేసి సోషల్‌ మీడియాలో వదులుతున్నారు. మార్కెట్లు ఎలా కుప్పకూలి పోతున్నాయి. ఇన్వెస్లర్లు సంపద అంతా కోల్పోయి ఎలా బికారుల్లా మారుతున్నారో తెలియజేస్తూ సరికొత్త మీమ్స్‌తో సోషల్‌ మీడియాను దున్నేస్తున్నారు. యుద్ధంతో నెలకొన్న ఉత్కంఠ క్షణాల మధ్య ఈ మీమ్స్‌ కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు