హ్యాకర్ల దెబ్బకు వణికిపోతున్న రష్యా.. వెబ్‌సైట్లు డౌన్.!

17 Mar, 2022 19:17 IST|Sakshi

మునుపెన్నడూ లేని విధంగా రష్యన్ ప్రభుత్వ వెబ్‌సైట్లు సైబర్ దాడులను ఎదుర్కొంటున్నాయి. విదేశీ వెబ్ ట్రాఫిక్'ను ఫిల్టర్ చేయడానికి సాంకేతిక నిపుణులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికి సమస్య కొలిక్కి రావడం లేదు. ఉక్రెయిన్‌లో జరిగిన సంఘటనల వల్ల రష్యన్ ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారు. రష్యా దేశానికి చెందిన ప్రధాన ప్రభుత్వ స్బెర్ బ్యాంక్ సైబర్ దాడులను ఎదుర్కొంది. సైబర్ దాడులు పెరగడంతో ప్రస్తుత పరిస్థితులను అదుపు చేయడానికి మంత్రిత్వ శాఖ పనిచేస్తోందని తెలిపింది.

"ఇంతకు ముందు గరిష్ట సమయాల్లో వస్తున్న 500 గిగాబైట్ల ట్రాఫిక్ కంటే ఇప్పుడు 1 టెరాబైట్ ట్రాఫిక్ వస్తున్నట్లు" మంత్రిత్వ శాఖ తెలిపింది. "ఇంతకు ముందు ఎదుర్కొన్న సైబర్ దాడుల కంటే ఇది రెండు నుంచి మూడు రెట్లు శక్తివంతమైనది" అని పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు రష్యా  నిషేదం విధించడంతో ఇప్పుడు ఆ దేశం ఒంటరిగా మారింది. ఈ సైబర్ దాడులను ఎదుర్కోవడానికి డిజిటల్ మంత్రిత్వ శాఖ ఆ దేశ ఐటీ కంపెనీలకు గ్రాంట్ల రూపంలో రూ.14 బిలియన్లు (సుమారు రూ.1,000 కోట్లు) కేటాయించాలని ప్రతిపాదించినట్లు ఇంటర్ ఫ్యాక్స్ నివేదించింది. కొద్ది రోజుల క్రితం ఉక్రెయిన్‌కు మద్దతుగా ‘అనానమస్‌’ గ్రూప్‌ రష్యాపై ‘సైబర్ వార్’ ప్రకటించింది. ఉక్రెయిన్‌లో రష్యా విధ్వంసానికి ప్రతిస్పందనగా తాము పదుల కొద్దీ రష్యన్ వెబ్‌సైట్‌లను హ్యాక్‌ చేసినట్లు ‘అనానమస్‌’ గ్రూప్‌ పేరిట సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు దర్శనమిచ్చాయి.

(చదవండి: ఉద్యోగులకు శుభవార్త..రూ.5 లక్షల నుంచి రూ.75లక్షల వరకు రుణాలు!)

>
మరిన్ని వార్తలు