అన్‌అకాడమీలో సచిన్‌ పెట్టుబడులు

24 Feb, 2021 08:43 IST|Sakshi

అన్‌అకాడమీలో సచిన్‌ వాటా

బ్రాండ్‌ అంబాసిడర్‌గా సచిన్‌

యూజర్లకు  స్పోర్ట్స్‌ పాఠాలు

సాక్షి,బెంగళూరు: భారత మాజీ క్రికెట్ స్టార్ సచిన్ టెండూల్కర్ బెంగళూరుకు చెందిన ఎడ్యుకేషన్ టెక్ స్టార్టప్ అన్‌అకాడమీతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్నికుదుర్చుకున్నారు.ఎడ్యుకేషన్‌ టెక్‌ స్టార్టప్‌ అన్‌అకాడమీలో ఆయన బారీ పెట్టుబుడులు పెట్టారు. దీంతో వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా సంస్థ బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా ఆయన వ్యవహరిస్తారు. అలాగే లైవ్‌ క్లాసుల ద్వారా విద్యార్థులకు బోధిస్తారు. సచిన్‌ తన జీవిత పాఠాలనూ పంచుకుంటారు. అన్‌అకాడమీ ప్లాట్‌ఫాంలో  యూజర్లకు ఈ తరగతులు ఉచితమని కంపెనీ తెలిపింది.

స్పోర్ట్స్ లెర్నింగ్ విభాగంలో సచిన్‌తో కలిసి లోతైన కంటెంట్-నేతృత్వంలోని భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయడానికి  కృషి చేస్తున్నామని, పూర్తి వివరాలు రాబోయే నెలల్లో ఆవిష్కరించనున్నామని అకాడమీ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ గౌరవ్ ముంజాల్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ భాగస్వామ్యంలో భాగంగా."ఆటలో తన అనుభవాలను పాఠాలుగా యువతతో పంచుకోవడంపాటు, వారికి ఉత్సాహాన్నివ్వాలనేదే తన ప్రయత్నమని  టెండూల్కర్ చెప్పారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు