Sachin Tendulkar : అ‍ప్పుడు స్పిన్‌తో.. ఇప్పుడు స్పిన్నీతో..

14 Dec, 2021 21:06 IST|Sakshi

ఆస్ట్రేలియన్‌ ఏస్‌ లెగ్‌ స్పిన్నర్‌  షేన్‌వార్న్‌కి కలలో సైతం చుక్కలు చూపించిన బ్యాట్స్‌మన్‌ సచిన్‌ టెండూల్కర్‌. ఒకప్పుడు స్సిన్‌ బౌలింగ్‌ను సునాయసంగా ఎదుర్కొని పరుగుల వరద పారించిన ఈ బ్యాట్స్‌మన్‌.. ఇప్పుడు స్పిన్నీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారాడు.


బ్రాండ్‌ ఎండార్సర్‌
క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌ మరో వ్యాపారంలో అడుగు పెట్టారు. ఇప్పటికే అనేక బ్రాండ్లకు అంబాసిడర్‌గా పలు కంపెనీల్లో పార్ట్‌నర్‌గా ఆయన ఉన్నారు. తాజాగా అప్‌కమింగ్‌ బిజినెస్‌గా పేర్కొంటున్న యూజ్‌డ్‌ కార్‌ బిజినెస్‌లోకి ఇతర క్రీడాకారులకంటే ముందే అడుగు పెట్టారు. యూజ్‌డ్‌ కారు రిటైలింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌గా ఉన్న స్పిన్నీకి బ్రాండ్‌ ఎండార్సర్‌గా  సచిన్‌ వ్యవహరిస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. 


స్ట్రాటజిక్‌ ఇన్వెస్టర్‌
అనతి కాలంలోనే యూనికార్న్‌గా మారిన స్పిన్నీలో స్ట్రాటజిక్‌ ఇన్వెస్టర్‌గా సచిన్‌ పెట్టుబడులు పెట్టారు. అంతేకాదు ఈ సంస్థకు బ్రాండ్‌ ఎండార్సర్‌గా ప్రచారం కూడా చేయనున్నారు. అయితే సచిన్‌ ఇందులో ఎంత మొత్తం పెట్టుబడులు పెట్టారనే అంశాలను స్పిన్ని సంస్థ బహిర్గతం చేయలేదు.


పీవీ సింధుతో పాటు సచిన్‌
స్పిన్ని సంస్థ ఈ ఏడాది ఆరంభంలో పీవీ సింధుతో జత కట్టింది. తాజాగా సచిన్‌ను తమతో చేర్చుకుని మార్కెట్‌లో పాగా వేసేందుకు వేగంగా పావులు కదుపుతోంది. మరోవైపు టీనేజ్‌లోనే బూస్ట్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా కనిపించిన సచిన్‌ గత పాతికేళ్లలో అనేక సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరించారు. అనేక స్పోర్ట్స్‌లీగుల్లో పెట్టుబడులు పెట్టారు.


స్పిన్ని ప్రస్థానం
యూజ్‌డ్‌ కారు రిటైలింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌గా మార్కెట్‌లోకి ఎంటరైన అనతి కాలంలోనే తనదైన ముద్ర వేసింది స్పిన్ని. ఇటీవల ఈ సిరీస్‌ ఈ ఫండింగ్‌ రౌండ్‌లో స్పిన్ని సంస్థలోకి 238 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఇప్పటి వరకు 530 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు సమీకరించింది స్పిన్ని. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్‌ వ్యాల్యుయేన్‌ 1.80 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. 
 

చదవండి: బిగ్‌–సి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మహేశ్‌ బాబు

మరిన్ని వార్తలు