సాగర్‌ సిమెంట్స్‌ లాభం జూమ్‌

29 Jul, 2021 00:56 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సిమెంట్‌ తయారీలో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ సాగర్‌ సిమెంట్స్‌ జూన్‌ త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాలు మెరుగ్గా నమోదు చేసింది. నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 42.35 శాతం ఎగసి రూ.51.43 కోట్లు సాధించింది. టర్నోవర్‌ 50 శాతం అధికమై రూ.397 కోట్లకు చేరుకుంది. ఎబిటా 23 శాతం పెరిగి రూ.107 కోట్లు దక్కించుకుంది.

ఈపీఎస్‌ 31.87 శాతం పెరిగి రూ.21.31గా ఉంది. మధ్యప్రదేశ్‌లో సద్గురు సిమెంట్స్‌ రూ.578 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ప్లాంట్‌ నిర్మాణం సెప్టెంబర్‌ నాటికి పూర్తి కానుంది. ఒడిశాలో జైపూర్‌ సిమెంట్స్‌ రూ.312 కోట్లతో నెలకొల్పుతున్న ప్లాంట్‌ రెండు నెలల్లో సిద్ధం అవుతోంది అని సంస్థ జేఎండీ శ్రీకాంత్‌ రెడ్డి వెల్లడించారు. సాగర్‌ సిమెంట్స్‌ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే బుధవారం 1.72 శాతం తగ్గి రూ.1,339.75 వద్ద స్థిరపడింది.

మరిన్ని వార్తలు