Sai Dharam Tej-Road Accident: సాయిధరమ్‌ తేజ్‌... చిత్రలహరిలో చెప్పింది ఇదే

11 Sep, 2021 13:59 IST|Sakshi

Sai Dharam Tej : టాలీవుడ్‌ నటుడు సాయి ధరమ్‌ తేజ్‌ యాక్సిడెంట్‌ ఇవాళ వార్తల్లో ప్రముఖంగా నిలిచిన విషయం తెలిసిందే. యాక్సిడెంట్‌ జరిగిన వెంటనే స్థానికులు 108కి సమాచారం అందించడంతో గోల్డెన్‌ అవర్‌లో చికిత్స అంది ప్రాణపాయం తప్పింది. నిజ జీవితానికి దగ్గర అన్నట్టుగానే సరిగ్గా ఏడాది కిందట ప్రమాదంలో గాయపడినప్పుడు చుట్టు పక్కల ఎవ్వరూ లేకపోయినా తక్షణ సాయం ఎలా పొందాలనే కాన్సెప్టుతో యాప్‌ను డెవలప్‌ చేసే యువకుడిగా తేజ్‌ చిత్రలహరి అనే సినిమా వచ్చింది. యాక్సిడెంట్‌ అలెర్ట్‌ సిస్టమ్‌ పేరుతో ఓ స్టార్టప్‌ నెలకొల్పే న్యూ ఎంట్రప్యూనర్‌గా తేజ్‌ అందులో కనిపించారు. ఒక ఐడియా ఎంతోమంది జీవితాల్లో మార్పు తెస్తుంది. అయితే ఆ ఐడియా కార్యరూపం దాల్చే క్రమంలో ఎదురయ్యే ఒడిదుడుకులు, ఆటుపోట్లు, అవకాశాలు ఎలా ఉంటాయినే వివరాలు...

స్టార్టప్‌
ఒకప్పుడు వ్యాపారం అనేది కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఉండేది. అది కూడా సంప్రదాయ పద్దతిలోనే కొనసాగేది. కానీ కొత్త వాళ్లు ఆ రంగంలో ప్రవేశించడం దుర్లభంగా ఉండేంది. వచ్చినా నిలదొక్కుకోవడం కష్టంగా ఉండేది. అయితే ఇంటర్నెట్‌ యాక్సెస్‌ పెరగడం, స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి రావడంతో వ్యాపారంలో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. మంచి కాన్సెప్టు ఉంటే చాలు తక్కువ పెట్టుబడితో స్టార్టప్‌లను ప్రారంభిస్తున్నారు ‍ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు

సక్సెస్‌ మంత్ర
స్టార్టప్‌ల విజయాల గురించి చర్చిస్తే ఫ్లిప్‌కార్ట్‌ మొదలు బైజూస్‌, అన్‌ అకాడమీ, జోమాటో, స్విగ్గీ, పేటీఎం, ఓయో, ఓలా ఒక్కటేమికి వరుసగా అనేక కంపెనీలు మన కళ్లేదుటే ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. ఈ స్టార్టప్‌లు ప్రారంభమై కష్టనష్టాలు ఎదుర్కొని వేల కోట్ల మార్కెట్‌ విలువను సొంతం చేసుకునేందుకు సంప్రదాయ పద్దతిలో ఏళ్లకు ఏళ్లు తీసుకోలేదు. జస్ట్‌ ఐదు నుంచి పదేళ్లలోనే వేల కోట్లకు చేరుకున్నాయి. కారణం కొత్త దనం, ఈజీ యాక్సెస్‌. స్టార్టప్‌ కంపెనీలకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలు. అయితే ఈ రెండు ఉంటేనే కంపెనీలు సక్సెస్‌ అవుతాయా అంటే కాదనే చెప్పాలి. స్టార్టప్‌ పుట్టుకకు కారణమైన కాన్సెప్టుకి వెన్నుదన్నుగా నిలిచే వెంచర్‌ క్యాపిటలిస్టులది ముఖ్య పాత్ర,

వెంచర్‌ క్యాపిటలిస్టులు
ఒకప్పుడు వ్యాపారం మొదలు పెట్టాలంటే రుణం కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అనేక రూల్స్‌, నిబంధనలు, అధికారుల అలసత్వం, బంధుప్రీతి, రాజకీయ జోక్యం తదితర కారణాల వల్ల ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు రుణాల మంజూరు తలకు మించిన భారం అయ్యేది. కానీ వెంచర్‌ క్యాపిటలిస్టులు పెరిగిన తర్వాత ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది.

ఒప్పించడం సవాలే
వ్యాపారం రంగంలో సక్సెస్‌ అయ్యే కాన్సెప్టులకి సహాకారం అందించేందుకు వెంచర్‌ క్యాపిటలిస్టులు ఎప్పుడూ రెడీగా ఉంటారు. అయితే వెంచర్‌ క్యాపిటలిస్టుల దగ్గరికి చేరుకోవడం, అక్కడ వారిని కాన్సెప్టుకి గ్రీన్‌ సిగ్నల్‌ తెచ్చుకోవడమనేది మరో యజ్ఞం లాంటింది. కాన్సెప్టులో దమ్ముండి, వెంచర్‌ క్యాపిటలిస్టుల అండ లభిస్తే ఇక ఆ వ్యాపారానికి తిరుగు ఉండందు. మన దగ్గర దేశీ కంపెనీలతో విదేశీ సంస్థలకు చెందిన అనేక వెంచర్‌ క్యాపిటిలస్టులు పెట్టుబడులకు రెడీగా ఉన్నారు. అయితే వెంచర్‌ క్యాపిటలిస్టుల దగ్గరికి చేరడం కష్టం. దీనికి సంబంధించిన కష్టాలు ఎలా ఉంటాయనే అంశాలు మనకు చిత్రలహరి, ఆకాశమేన ఈ హద్దురా సినిమాల్లో పూసగుచ్చినట్టు వివరించారు. 

వాళ్లే వస్తున్నారు
విభిన్నతకు నిలయమైన భారత్‌లాంటి దేశంలో పెట్టుబడుల అవసరాలు గుర్తించిన అనేక మంది వెంచర్‌ క్యాపిటలిస్టులు తమ రూటు మార్చుకున్నారు. టెక్‌ దిగ్గజ కంపెనీలు సైతం స్టార్టప్‌లకు చేయూత ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌ వంటి సంస్థలు స్టార్టప్‌లకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ముందుకు వచ్చాయి. ప్రత్యేకంగా స్టార్టప్‌ కాంపిటీషన్లు నిర్వహిస్తున్నాయి.

ప్రభుత్వ పరంగా
స్టార్టప్‌లకు చేయూత ఇచ్చేందుకు ప్రభుత్వ పరంగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం టీ హబ్‌ పేరుతో హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఇంక్యుబేషన్‌ సెంటర్‌ను నిర్మించింది. హైదరాబాద్‌తో పాటు వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం వంటి నగరాల్లోనూ ఐటీ ఇంక్యుబేషన్‌ సెంటర్లు అందుబాటులోకి వ​చ్చాయి. మంచి కాన్సెప్టుతో ఇక్కడికి వెళితే ప్లగ్‌ అండ్‌ ప్లే మోడ్‌లో పని చేసుకోవచ్చు.

ప్రైవేటు పరంగా
స్టార్టప్‌లకు ఉండే పరిమిత వనరులను దృష్టిలో ఉంచుకుని అతి తక్కువ ఖర్చుతో వర్క్‌స్పేస్‌ను అందించే సంస్థలు సైతం పుట్టుకొచ్చాయి. ఇవి కాఫీ లాంజ్‌ తరహాలో ఉంటాయి. మన కంప్యూటర్‌/లాప్‌ట్యాప్‌లతో అక్కడికి వెళితే చాలు టేబుల్‌, ఇంటర్నెట్‌, కాఫీ, లంచ్‌ తదితర సౌకర్యాలు కల్పిస్తారు. పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్లిపోవచ్చు. అతి తక్కువ ఖర్చుతో ఈ తరహా ఆఫీస్‌ స్పేస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఫ్యామిలీమ్యాన్‌ వెబ్‌ సిరీస్‌లో ఈ తరహా స్టార్టప్‌లోనే  సుచిత్ర మొదట పని చేస్తుంది. 
 

చదవండి : Bigg Boss: బాస్‌లకే బాస్‌ అసలైన బిగ్‌బాస్‌ ఇతనే

మరిన్ని వార్తలు