సెయిల్‌ లాభం నేలచూపు 

14 Feb, 2023 09:50 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) మూడో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ మెటల్‌ దిగ్గజం సెయిల్‌ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన అక్టోబర్‌-డిసెంబర్‌ (క్యూ3)లో నికర లాభం 65 శాతం క్షీణించి రూ. 542 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో దాదాపు రూ. 1,529 కోట్లు ఆర్జించింది.

మొత్తం ఆదాయం మాత్రం రూ. 25,398 కోట్ల నుంచి రూ. 25,140 కోట్లకు స్వల్పంగా తగ్గింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 23,210 కోట్ల నుంచి రూ. 24,825 కోట్లకు ఎగశాయి. ముడిస్టీల్‌ ఉత్పత్తి 4.531 మిలియన్‌ టన్నుల నుంచి 4.708 ఎంటీకి పుంజుకుంది. అమ్మకాలు సైతం 3.84 ఎంటీ నుంచి 4.15 ఎంటీకి బలపడ్డాయి. కంపెనీ వార్షికంగా 21 ఎంటీ స్టీల్‌ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. 
 

మరిన్ని వార్తలు