సాక్షి మనీ మంత్రా: వరుసగా నాలుగో సెషన్లోనూ లాభాలే!

6 Sep, 2023 15:57 IST|Sakshi

Today StockMarket Closing: దేశీయ స్టాక్‌మార్కెట్లు  లాభాల్లో ముగిసాయి. ఆరంభంలోనే  స్థబ్దుగా  ఉన్న మార్కెట్లు ఆ తరువాత అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.  200  పాయింట్లకు పైగా నష్టపోయాయి. కానీ  ఆఖరి సెషన్‌లో కొనుగోళ్లతో  నష్టాలనుంచి కోలుకుని పాజిటివ్‌గా ముగిసాయి.సెన్సెక్స్ 100.26 పాయింట్లు లేదా 0.15 శాతం లాభంతో  65,880.52 వద్ద, నిఫ్టీ 36.10 పాయింట్లు లేదా 0.18 శాతం పెరిగి 19,611 వద్ద  ముగిసాయి. 

తద్వారా నిఫ్టీ 19,600కి ఎగువన భారత బెంచ్‌మార్క్ సూచీలు వరుసగా నాలుగో సెషన్‌లో సానుకూలంగా ముగియడం విశేషం. ఎఫ్‌ఎంసిజి ఇండెక్స్ 1 శాతం పెరగగా, ఫార్మా, ఆయిల్ & గ్యాస్ , పవర్ ఇండెక్స్‌లు ఒక్కొక్కటి 0.5 శాతం లాభపడ్డాయి. మరోవైపు మెటల్, రియాల్టీ, బ్యాంక్ సూచీలు 0.4-1 శాతం క్షీణించాయి.  టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, దివీస్ లేబొరేటరీస్, భారతీ ఎయిర్‌టెల్, సిప్లా మరియు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ టాప్ గెయినర్స్‌గా ఉండగా, యాక్సిస్ బ్యాంక్, హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా స్టీల్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్‌టిపిసి టాప్‌ లూజర్స్‌గానూ  నిలిచాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఫ్లాట్ నోట్‌లో ముగిశాయి.

రూపాయి: మంగళవారం ముగింపు 83.03తో పోలిస్తే బుధవారం డాలర్‌ మారకంలో  రూపాయి 10 పైసలు తగ్గి 83.13 వద్ద ముగిసింది. 

మరిన్ని వార్తలు