సాక్షి మనీ మంత్ర: కొనసాగుతున్న ర్యాలీ.. లాభాల్లో దేశీయ మార్కెట్లు

29 Nov, 2023 09:27 IST|Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:21 సమయానికి నిఫ్టీ 82 పాయింట్లు పుంజుకుని 19,972 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 274 పాయిట్లు లాభపడి 66,444 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. యూరప్‌ మార్కెట్లు రేంజ్‌బౌండ్‌లో ట్రేడయ్యాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు 783 కోట్లు, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు 1324 కోట్లు మేర స్టాక్‌లు కొనుగోలు చేశారు. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారక విలువ 83.31కు చేరింది. తాజాగా ఐపీఓకు వచ్చిన ఐదు కంపెనీల్లో మదుపరులు దాదాపు రూ.2.5 లక్షల కోట్లతో లిస్టింగ్‌కు ప్రయత్నించారు. ఐపీఓ అలాట్‌ అవ్వని రిటైల్‌ ఇన్వెస్టర్లు తిరిగి ఆ డబ్బును మార్కెట్‌లో పెట్టాలని భావిస్తుంటారు. దాంతో మార్కెట్లు పెరిగే అవకాశం ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు. గురువారం ఫెడ్‌ ఛైర్మన్‌ జొరమ్‌పావెల్‌ సమావేశం ఉండడంతో శుక్రవారం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వారాంతంలో దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో మార్కెట్‌లో కొంత ఒడుదొడుకులు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

సెన్సెక్స్‌ 30లోని స్టాక్‌ల్లో సన్‌ఫార్మా, మారుతీసుజుకీ స్టాక్‌లు మినహా అన్ని స్టాక్‌లు లాభాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టెక్‌ మాహీంద్రా, ఎం అండ్‌ ఎం, భారతీ ఎయిర్‌టెల్‌, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, యాక్సిక్‌ బ్యాంక్‌ స్టాక్‌లు మంచి లాభాల్లో ఉన్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

మరిన్ని వార్తలు