నిఫ్టీ50 కంపెనీల్లో మహిళా ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా..

23 Oct, 2023 20:36 IST|Sakshi

భారతీయ కంపెనీల్లోని మహిళా ఉద్యోగుల జీతాలు సగటున పురుష ఉద్యోగుల జీతాల కంటే దాదాపు పదో వంతు తక్కువగా ఉన్నాయని కొన్ని కథనాలు ప్రకారం తెలుస్తుంది. నిఫ్టీ50 కంపెనీల్లోని స్త్రీ, పురుష ఉద్యోగుల జీతాలను విశ్లేషించి కొంత డేటాను సేకరించారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి.

నిఫ్టీ50లోని 31 కంపెనీల్లో మహిళల జీతాల కంటే పురుషుల జీతాలు ఎక్కువగా ఉన్నాయి. సగటు స్త్రీల జీతాలు పురుషుల జీతాల కంటే 9.2% తక్కువగా ఉన్నాయి. ఇది సుమారు సంవత్సరానికి రూ.1.2 లక్షల వేతన వ్యత్యాసానికి సమానం. పురుషుల జీతాలు దాదాపు ఏటా రూ.12.9 లక్షలు అయితే మహిళా ఉద్యోగుల జీతాలు రూ.11.7 లక్షలుగా ఉన్నాయి. 

టాప్ మేనేజ్‌మెంట్ స్థానాల్లో మహిళల సంఖ్య తక్కువగా ఉంది. అధిక కుటుంబ బాధ్యతలు, కెరీర్ బ్రేక్‌లు, కెరీర్ స్విచ్‌లు వంటి అంశాలు ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే అదానీ ఎంటర్‌ప్రైజెస్, బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, ఎల్‌ అండ్‌ టీ మైండ్‌ట్రీ కంపెనీల్లో పురుషుల జీతాలు 30-46% ఎక్కువగా ఉన్నాయి. టాటా కన్జ్యూమర్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, సిప్లా వంటి కంపెనీల్లో మహిళల వేతనాలు 20-73% ఎక్కువగా ఉన్నాయని డేటా తెలుపుతుంది.

మరిన్ని వార్తలు