అన్‌ఎకాడమీ ఫౌండర్స్‌ సంచలన నిర్ణయం

31 Mar, 2023 16:14 IST|Sakshi

సాక్షి,ముంబై:  ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్‌ల దగ్గర్నించి, దిగ్గజ కంపెనీలుగా దాకా ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగాల కోతకు నిర్ణయిస్తున్నాయి. ఇందులో ఎడ్యుటెక్‌ యూనికార్న్‌  అన్‌ఎకాడెమీ కూడా మినహాయింపేమీ కాదు. అయితే  తాజాగా అన్‌ఎకాడెమీ ఫౌండర్స్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది(2024) ఏప్రిల్ వరకూ  తమ వేతానల్లో కోత విధించుకుంటున్నట్టు కంపెనీ సీఈవో గౌరవ్ ముంజాల్ ప్రకటించారు.  తొలగింపులను ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం వెలుగులోకి వచ్చింది.   (మళ్లీ ఉద్యోగాల కోత..12 నెలల్లో 1400మందిని తొలగించిన స్టార్టప్‌)

వ్యవస్థాపకులతో సహా  టాప్‌ లీడర్‌షిప్‌ జీతాల్లో  ఈ  కోత ఉండనుంది. తాల్లో కోత 25 శాతం వరకు ఉండవచ్చని అంచనా. ఈ తగ్గింపు  వారి  ప్రస్తుత జీతం, పరిధి , పనితీరుపై ఆధారపడి ఉంటుందని, తిరిగి ఏప్రిల్ 2024లో మాత్రమే సవరిస్తామని కంపెనీ వెల్లడించింది. కాగా వరుసగా నాలుగోసారి 12 శాతం ఉద్యోగులను తొలగిస్తున్నట్టు గురువారం ప్రకటించింది.

(IPL 2023: ఆ క్రికెటర్‌కు లక్కీ చాన్స్‌, టియోగో ఈవీ ఓనర్లకు బంపర్‌ ఆఫర్లు)

కాగా గత ఏడాది  కాలంగా దాదాపు 1400 మందిఉద్యోగులకు ఉద్వాసన పలికింది. 2022లో పలు  రౌండ్ల తొలగింపుల ద్వారా  సిబ్బంది సంఖ్యను 1,350 తగ్గించకుంది. 2020-21ఆర్థిక సంవత్సరంలో సంస్థ నష్టాలు రూ. 1,537 కోట్ల నుండి సంవత్సరానికి (YoY) 85 శాతం పెరిగి రూ.2,848 కోట్లుగా ఉన్నాయి.  ఆదాయం రూ.719 కోట్లుగా ఉంది.

మరిన్ని వార్తలు