ఐటీ దిగ్గజం ‘సేల్స్‌ ‌ఫోర్స్’ భారీ సహాయం‌

10 Sep, 2020 16:01 IST|Sakshi

బెంగుళూరు: ప్రముఖ క్లౌడ్‌, ఐటీ దిగ్గజం సేల్స్‌ఫోర్స్‌ దేశంలోని డిజిటల్‌ నైపుణ్యాలను పెంచేందుకు 6 ఎన్‌జీఓ సంస్థలకు భారీ సహాయాన్ని ప్రకటించింది. డిజిటల్‌ నైపుణ్యాల పెంపు కోసం (2లక్షల 40వేల డాలర్ల) నిధులను కేటియించి ఔదార్యాన్ని చాటుకుంది. ప్రస్తుత డిజిటల్‌ యుగంలో ప్రతి మనిషికి డిజిటల్‌ నైపుణ్యాలు ఎంతో అవసరమని సేల్స్‌ఫోర్స్‌ ఇండియా సీఈఓ అరందతి బట్టాచార్య తెలిపారు. దేశ వ్యాప్తంగా అత్యుత్తమ సేవలందిస్తున్న ఆరు ఎన్‌జీఓ(అక్షయ పాత్ర ఫౌండేషన్, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్, ఆంథిల్ క్రియేషన్స్ ఫౌండేషన్, గూంజ్, ఎస్‌ఓఎస్‌ చిల్డ్రన్స్ విలేజెస్ ఆఫ్ ఇండియా, ప్రోత్సాహాన్ ఇండియా ఫౌండేషన్ సంస్థలకు నిధులు కేటాయించింది.

అయితే ఈ సంస్థలు 15,000 మంది డిజిటల్‌ నైపుణ్యాలకు శిక్షణ ఇవ్వనున్నారు. కాగా కరోనా సంక్షోభంలోను తమ సంస్థ కస్టమర్లకు మెరుగైన సేవలను అందించినట్లు తెలిపారు. సేల్స్‌ఫోర్స్‌ సంస్థలో ఖర్చు తక్కువతో మెరుగైన సేవలు అందిస్తుందని సంస్థ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. కాగా 1999 సంవత్సరంలో ఏర్పాటయిన సేల్స్‌ఫోర్స్‌ కంపెనీ 1,700 కోట్ల డాలర్ల తో క్లౌడ్‌ విభాగంలో అగ్రగామి సంస్థగా నిలిచింది. సేల్స్‌ఫోర్స్ సంస్థ కేవలం క్లౌడ్‌ విభాగంలో మాత్రమే కాకుండా మొబైల్‌, సోషల్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, కృత్రిమ మేధ(ఆర్టిఫీషియల్‌ ఇంటలిజన్స్‌) తదితర రంగాలలో మెరుగైన సేవలతో దూసుకెళ్తుంది.

మరిన్ని వార్తలు