మరోసారి బాంబు పేల్చిన చాట్‌జీపీటీ సృష్టికర్త ఆల్ట్‌మాన్

28 Mar, 2023 19:21 IST|Sakshi

చాట్‌జీపీటీ  (ChatGPT) కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌)తో తయారైన చాట్‌బాట్‌. ఏఐ చాట్‌ బాట్‌ టూల్స్‌ కొత్తపుంతలు తొక్కుతోన్న వేళ.. కొత్తగా వస్తోన్న టూల్స్‌ ఉద్యోగాలపై ప్రభావం చూపవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

ఈ నేపథ్యంలో చాట్‌జీపీటీ సృష్టికర్త,  ఓపెన్‌ఏఐ అనే సంస్థ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. కొద్ది రోజుల క్రితం ఏబీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆల్ట్‌మన్‌ చాట్‌జీపీటీ టెక్నాలజీపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అధునాతమైన సాంకేతిక కారణంగా పలు రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నట్లు తెలిపారు.

తాజాగా రష్యాన్‌ - అమెరికన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రిసెర్చర్‌ లెక్స్ ఫ్రిడ్మాన్ (Lex Fridman) పాడ్‌ కాస్ట్‌ ఇంటర్వ్యూ నిర్వహించారు. ఆ ఇంటర్వ్యూలో ఆల్ట్‌మన్ మాట్లాడుతూ.. త్వరలో కస్టమర్‌ సర్వీస్‌ రంగానికి చెందిన భారీ ఎత్తున ఉద్యోగాల స్థానాన్ని భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఏఐపై ఆందోళనలు నెలకొన్న తరుణంలో కృత్రిమ మేధ వినియోగంపై నిషేదం విధించాలని పలు దేశాలు కొత్త చట్టాలు అమలు చేస్తున్నాయి. న్యూయార్క్‌కు చెందిన పలు స్కూల్స్‌లో చాట్‌ జీపీటీ వినియోగం నిషేదంలో ఉండగా.. సంస్థలు మాత్రం కొత్త కొత్త యాప్స్‌ను తయారు చేసుకొని వ్యాపార కార్యకలాపాలు జోరుగా సాగిస్తున్నాయి. 

చదవండి👉 చాట్‌జీపీటీ సృష్టికర్త శామ్‌ ఆల్ట్‌మన్‌ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు