-

Samsung: మీ ఫోన్‌ రిపేర్‌ అయ్యిందా? శాంసంగ్ యూజర్లకు శుభవార్త!

31 Jul, 2022 17:33 IST|Sakshi

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ ఫోన్‌ వాడకం విపరీతంగా పెరుగుతోంది. అందులోని ఫీచర్లు అంతలా ఆకట్టుకుంటోంది. అయితే ఎంత టెక్నాలజీ ఉన్నప్పటికీ యూజర్ల పర్సనల్‌ డేటా (ఫోటోలు, చాట్‌, వీడియో) ఏదో ఓ రూపంలో అప్పుడప్పుడు బయటపడుతున్నాయి. వీటిలో ప్రధానంగా మన ఫోన్‌ రిపేర్‌ అయిన సందర్భాల్లో డేటా తస్కరించడం లాంటి జరుగుతుంటాయి. ఎలా అంటారా ఆ సమయంలో కొన్ని రోజుల పాటు రిపేర్‌ షాపులో మన ఫోన్‌ని ఉంచకతప్పదు. అప్పటి నుంచి ఫోన్‌లోని డేటాకు సంబంధించి ఆందోళనపడడమో, లేదా డేటాను ముందుగానే డిలీట్ చేసి బ్యాకప్‌ చేసుకోవడం లాంటి పనులు మనకు షరా మామూలే.

ఇకపై అలాంటివి ఇబ్బందులు ఎదురుకాకుండా శాంసంగ్‌ కంపెనీ తమ కస్టమర్ల కోసం కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది. ఈ ఫీచర్ ద్వారా మన డేటా సేఫ్‌గా ఉంటుంది. దక్షిణ కొరియా శాంసంగ్‌ తెలిపిన వివరాల ప్రకారం తమ కంపెనీ ఫోన్లలో రిపేర్ మోడ్ పేరుతో అదిరిపోయే ఫీచర్‌ను ప్రవేశపెడుతోంది. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌21 (Samsung Galaxy S21) సిరీస్‌కు ఈ ఫీచర్‌తో విడుదల చేయాలని యోచిస్తోంది. అయితే ఇతర మోడళ్లకు కూడా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.

ఎలా పని చేస్తోంది ఈ ఫీచర్‌
మొబైల్‌లోని సెట్టింగ్‌ యాప్‌లో “బ్యాటరీ అండ్‌ డివైస్‌ కేర్‌” ఆఫ్షన్‌కి వెళ్లి రిపేర్‌ మోడ్‌ని ఆన్‌ చేయాలి. దీంతో మీ స్మార్ట్‌ఫోన్ రీబూట్ అవుతుంది. ఆ తర్వాత, ఫోటోలు, మెసేజ్‌లు, ఖాతాలు మొదలైన వాటితో సహా మీ వ్యక్తిగత డేటాను ఎవరూ యాక్సెస్ చేయలేరు. వెంటనే ఫోన్లో రిపేర్ మోడ్‌ యాక్టివేట్‌ అవుతుంది. దీని ద్వారా మీ ఫోన్‌ రిపేర్‌ చేసే వ్యక్తికి మన డేటా కనిపించకుండా చేస్తుంది. ఆ సమయంలో కేవలం ఫోన్‌లో డిఫాల్ట్ ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఫోన్‌ రిపేర్‌ పూర్తి కాగానే మనం మళ్లీ మొబైల్‌ని రీబూట్ చేసి వేలిముద్ర లేదా లాక్‌ ఆన్‌ చేయడం ద్వారా రీపేర్‌ మోడ్‌ డీయాక్టివేట్‌ చేయవచ్చు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పూర్తి వివరాలను శాంసంగ్‌ తెలపాల్సి ఉంది.

చదవండి: సూపర్‌ వ్యాన్‌.. దీని స్పెషాలిటీ తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

మరిన్ని వార్తలు