శాంసంగ్‌ బీఎండబ్ల్యూ స్పెషల్‌ ఎడిషన్‌.. 1000 ఫోన్లే..

10 Feb, 2023 13:43 IST|Sakshi

శాంసంగ్‌ ఇటీవలే తమ ప్రతిష్టాత్మక గెలాక్సీ ఎస్‌23 అల్ట్రా మోడల్‌ స్మార్ట్‌ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. తాజాగా ఇందులో మరో స్పెషల్‌ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. దక్షిణ కొరియాకు చెందిన ఈ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ తమ ఖరీదైన గెలాక్సీ ఎస్‌23 అల్ట్రా సిరీస్‌లో బీఎండబ్ల‍్యూ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. 

ఈ స్పెషల్‌ ఎడిషన్‌కు బీఎండబ్ల్యూ ఎం ఈ30 కారుకు గుర్తుగా శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 అల్ట్రా బీఎండబ్ల్యూ ఎం పేరు పెట్టారు. 1986లో ఈ కారు లాంచ్‌ అయింది. ఇది లిమిటెడ్‌ ఎడిషన్‌ అని, కేవలం 1000 ఫోన్లు మాత్రమే విక్రయిస్తామని కంపెనీ పేర్కొంది. అది కూడా దక్షిణ కొరియాలో మాత్రమే ఎస్‌కే టెలికాం సంస్థ ద్వారా ఈ స్పెషల్‌ ఎడిషన్‌ ఫోన్లు లభిస్తాయి.

కొత్తగా విడుదల చేసిన శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 అల్ట్రా బీఎండబ్ల్యూ ఎం ఫోన్‌కు వర్టికల్‌ కిడ్నీ గ్రిల్‌, బీఎండబ్ల్యూ ఎం కారు బోనెట్‌ వంటి దృఢమైన కేస్ ఉంటుంది. ఆక‌ర్షణీయమైన బీఎండబ్ల్యూ ఎం కారు రంగులతో ఇందులో యానిమేషన్‌ ఫీచర్‌ ఇచ్చారు. రిమూవబుల్‌ కీరింగ్‌, ఇంటర్‌చేంజబుల్‌ బీఎండబ్ల్యూ లోగోలు అదనపు ఆకర్షణ. దీంతో పాటు చిన్నపాటి ఎయిర్‌ కంప్రెషర్‌, మెటల్‌ లోగో ఇచ్చారు. ఈ ఫోన్‌ ధర 17.27 లక్షల సౌత్‌ కొరియన్‌ వాన్లు అంటే ఇండియన్‌ కరెన్సీలో రూ.1,12,790.

(ఇదీ చదవండి: రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్లలో శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 ఫోన్లు)

మరిన్ని వార్తలు