అదంతా ఫేకేనా.. శాంసంగ్‌ చీటింగ్‌ చేస్తోందా?

12 Mar, 2023 16:24 IST|Sakshi

అత్యంత కెమెరా జూమింగ్‌ సామర్థ్యంతో శాంసంగ్‌ అల్ట్రా సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను గత నెలలో విడుదల చేసింది. ఇందులో ముఖ్యంగా శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 అల్ట్రా ఫోన్‌ స్పేస్ జూమ్ ఫీచర్‌తో వచ్చింది. అయితే ఈ ఫోన్‌ తీసే స్పేస్ జూమ్ ఫోటోలు నకిలీవని తాను చేసిన  పరిశోధనలో తేలిందని ఓ రెడిట్ యూజర్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Oscar Award: థియేటర్‌ నుంచి ఆస్కార్‌కు.. ఈ పాప్‌కార్న్‌ గయ్‌ మామూలోడు కాదు..

ఇటీవల శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 జూమ్ లెన్స్‌లతో తీసిన చంద్రుని ఫోటోలను అందరూ ఆసక్తిగా చూశారు కానీ వాటి ప్రామాణికతపై తనకు మొదటి నుంచే సందేహాలు ఉన్నాయని, అవి పూర్తిగా అసలైనవి కావని అని రెడిట్‌లో ibreakphotos అనే పేరుతో ఉన్న ఓ యూజర్‌ పోస్ట్‌ చేశారు. దానికి సంబంధంచి పూర్తి వివరణ కూడా అందులో ఇచ్చారు.

ఇదీ చదవండి: Oscar Awards: ఆస్కార్‌ నామినీలకు ఆస్ట్రేలియాలో భూమి! కానీ..

తాను ఇంటర్నెట్ నుంచి చంద్రుని హై రెజల్యూషన్ ఫొటోను డౌన్‌లోడ్ చేసి దాని సైజ్‌ తగ్గించి గాస్సియన్ బ్లర్‌ను అప్లయి చేశానని, దీంతో అస్పష్టంగా మారిందని రెడిట్‌ యూజర్‌ పేర్కొన్నారు. ఆ తర్వాత దాన్ని శాంసంగ్‌ స్పేస్ జూమ్ కెమెరాతో ఫొటో తీస్తే ఆ ఫొటో చాలా స్పష్టంగా వచ్చిందని తెలిపారు. కానీ అది అసలైన ఫొటో కాదని, ఇలా అస్పష్టంగా ఉన్న ఫొటో స్పష్టంగా చేసేందుకు శాంసంగ్ ఏఐ(ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌) మోడల్‌ను ఉపయోగిస్తోందని ఆరోపించారు.

ఇదీ చదవండి: ట్విటర్‌ తరహాలో మెటా.. జుకర్‌బర్గ్‌పై ఎలాన్‌ మస్క్‌ తీవ్ర వ్యాఖ్యలు!

మరిన్ని వార్తలు