శామ్‌సంగ్ నుంచి మరో పవర్ ఫుల్ ప్రాసెసర్

13 Jan, 2021 13:15 IST|Sakshi

మొబైల్ తయారీ సంస్థ శామ్‌సంగ్ మరో పవర్ ఫుల్ ప్రాసెసర్ ప్రాసెసర్ ను తీసుకొచ్చింది. శామ్‌సంగ్ నిన్న(జనవరి 12న) నిర్వహించిన "ఎక్సినోస్ ఆన్" కార్యక్రమంలో ‘ఎక్సినోస్ 2100’ చిప్‌సెట్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త చిప్‌సెట్‌ను త్వరలో తీసుకురాబోయే గెలాక్సీ ఎస్ 21 స్మార్ట్‌ఫోన్ లో ఉపయోగించనున్నారు. ఎక్సినోస్ 2100 పవర్ ఫుల్ గేమింగ్, మల్టీ టాస్కింగ్ కి సపోర్ట్ చేసేలా అధునాతన 5-నానోమీటర్ టెక్నాలజీపై తయారు చేసిన మొట్టమొదటి హై-ఎండ్ 5జీ ప్రాసెసర్ అని టెక్ దిగ్గజం తెలిపింది. ఇతర ప్రాసెసర్లతో పోలిస్తే ఇది10 శాతం మెరుగ్గా, వేగంగా పనిచేస్తుందని శామ్‌సంగ్ పేర్కొంది. అంతేగాక, ఇది 20 శాతం విద్యుత్‌ను ఆదా చేస్తుందని స్పష్టం చేసింది.(చదవండి: రెడ్‌మీ మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్)

బ్రిటీష్ చిప్ డిజైన్ సంస్థ ఆర్మ్ లిమిటెడ్ కలిసి ఈ కొత్త చిప్‌సెట్‌ను రూపొందించినట్లు సంస్థ పేర్కొంది. శామ్‌సంగ్ ఎక్సినోస్ 2100 ట్రై-క్లస్టర్ ఆర్కిటెక్చర్‌తో వస్తుంది. దీని మల్టీ-కోర్ పనితీరు గత మోడళ్ల కంటే 30 శాతం మెరుగ్గా ఉందని యోన్హాప్ వార్తా సంస్థ నివేదించింది. ఆర్మ్ యొక్క సరికొత్త మాలి-జీ 79 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (జిపియు)తో దీనిని రూపొందించారు. ఎక్సినోస్ 2100 గ్రాఫిక్ పనితీరు పరంగా గతంతో పోలిస్తే 40 శాతం మెరుగుపడిందని సంస్థ తెలిపింది. వర్చువల్ రియాలిటీ మెరుగైన పనితీరును అందిస్తుంది అని శామ్‌సంగ్ పేర్కొంది. "5జీ, అడ్వాన్స్‌డ్ గ్రాఫిక్స్, ఆన్-డివైస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించినట్లు" అని పాల్ విలియమ్సన్ అన్నారు. 

200 మెగా పిక్సల్ కెమెరాకు సపోర్ట్:
ఎక్సినోస్ 2100 హై-ఎండ్ ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్‌తో వస్తుంది. దింతో 200 మెగాపిక్సెల్‌ల వరకు ఇమేజ్ రిజల్యూషన్‌కు సపోర్ట్ చేస్తుంది. దీన్ని గరిష్టంగా ఆరు ఇమేజ్ సెన్సార్‌లతో కనెక్ట్ చేయవచ్చు.  దీనిలో వాడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI ) టెక్నాలజీతో అధునాతన ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ దృశ్యాలు, ముఖాలు, వస్తువులను తిరిగి అమర్చవచ్చు. ఎక్సినోస్ 2100 చిప్‌సెట్ 5G టెక్నాలజీ, ఎమ్ఎమ్ వెవ్ స్పెక్ట్రమ్‌లకు కూడా సపోర్ట్ చేస్తుంది. ఎక్సినోస్ 2100 7.35 జిబిపిఎస్, 5.6 జిబిపిఎస్ వరకు డౌన్‌లింక్ స్పీడ్ను అందించగలదని సాంసంగ్ స్పష్టం చేసింది. మార్కెట్ ట్రాకర్ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం.. మొబైల్ ప్రాసెసర్ మార్కెట్లో 2020 మూడవ త్రైమాసికంలో 12శాతం శామ్సంగ్ వాటాతో మూడవ స్థానంలో నిలిచింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 4శాతం తగ్గింది. తైవాన్ మీడియాటెక్ ఇంక్ 31 శాతం వాటాతో మొదటి స్థానంలో నిలవగా, యుఎస్ ఆధారిత క్వాల్కమ్ 29 శాతం వాటాతో రెండవ స్థానంలో ఉంది.
 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు