శామ్​సంగ్ నుంచి సరికొత్త మొబైల్స్ విడుదల

18 Mar, 2021 17:15 IST|Sakshi

ప్రముఖ మొబైల్​ తయారీ సంస్థ శామ్​సంగ్​ తన గెలాక్సీ ‘ఏ’ సిరీస్​ నుంచి గెలాక్సీ ఏ52, ఏ52 5జీ, ఏ72 అనే మూడు మోడళ్లను అంతర్జాతీయ మార్కెట్ లో విడుదల చేసింది. మార్చి 17న జరిగిన ‘గెలాక్సీ ఆసమ్ ​అన్​ప్యాక్డ్​’ ఆన్​లైన్​ కార్యక్రమంలో ఈ మూడు మోడళ్లను విడుదల చేసింది. మూడు ఫోన్‌లు ఐపీ67 సర్టిఫైడ్ డస్ట్ - వాటర్ రెసిస్టెంట్ డిజైన్‌తో వస్తాయి. గెలాక్సీ ఎ 52 మోడల్స్, గెలాక్సీ ఎ72లో క్వాడ్ రియర్ కెమెరాలతో పాటు హోల్-పంచ్ డిస్ప్లే డిజైన్ కూడా ఉన్నాయి. శామ్​సంగ్ తన కొత్త గెలాక్సీ ఎ-సిరీస్ ఫోన్లు ఒకే ఛార్జీతో రెండు రోజుల బ్యాటరీ జీవితాన్ని అందిస్తాయని పేర్కొంది. గెలాక్సీ ఏ సిరీస్​ స్మార్ట్​ఫోన్లు అద్భుతమైన డిస్​ప్లే, ప్రో-గ్రేడ్ కెమెరా, దీర్ఘకాలిక మన్నిక ఇచ్చే బ్యాటరీకి గుర్తింపు పొందాయి. ఇప్పటికే గెలాక్సీ నుంచి వచ్చిన ఏ సిరీస్​ ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును సాధించాయి. వీటి ధర, భారత మార్కెట్​లోకి ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారు అనే దానిపై స్పష్టత లేదు.

గెలాక్సీ ఎ52 ఫీచర్లు:

  • 6.5 అంగుళాల సూపర్​ అమోలెడ్​ ఇన్ఫినిటీ ఓ డిస్​ప్లే
  • 90 హెర్ట్జ్​ రిఫ్రెష్​ రేట్ 
  • స్నాప్ డ్రాగన్ 732జీ ప్రాసెసర్
  • 64 ఎంపీ ప్రైమరీ + 12 ఎంపి అల్ట్రా వైడ్ + 5 ఎంపీ మాక్రో లెన్స్ + 5 ఎంపీ డెప్త్ కెమెరా  
  • 32 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 4 జీబీ + 6 జీబీ + 8 జీబీ ర్యామ్ 
  • 128 జీబీ లేదా 256 జీబీ స్టోరేజ్
  • 4,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
  • ఆండ్రాయిడ్ 11 వన్ యుఐ 3.1 

గెలాక్సీ ఎ52 5జీ ఫీచర్లు:

  • 6.5 అంగుళాల సూపర్​ అమోలెడ్​ ఇన్ఫినిటీ ఓ డిస్​ప్లే
  • 120 హెర్ట్జ్​ రిఫ్రెష్​ రేట్ 
  • స్నాప్ డ్రాగన్ 732జీ ప్రాసెసర్
  • 64 ఎంపీ ప్రైమరీ + 12 ఎంపి అల్ట్రా వైడ్ + 5 ఎంపీ మాక్రో లెన్స్ + 5 ఎంపీ డెప్త్ కెమెరా
  • 32 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 4 జీబీ + 6 జీబీ + 8 జీబీ ర్యామ్ 
  • 128 జీబీ లేదా 256 జీబీ స్టోరేజ్
  • 4,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
  • ఆండ్రాయిడ్ 11 వన్ యుఐ 3.1 

గెలాక్సీ ఎ72 ఫీచర్లు:

  • 6.7 అంగుళాల సూపర్​ అమోలెడ్​ ఇన్ఫినిటీ ఓ డిస్​ప్లే
  • 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌
  • స్నాప్ డ్రాగన్ 732జీ ప్రాసెసర్
  • 64 ఎంపీ ప్రైమరీ + 12 ఎంపి అల్ట్రా వైడ్ + 5 ఎంపీ మాక్రో షూటర్ + 8 ఎంపీ టెలిఫోటో షూటర్
  • 32 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 6 జీబీ ర్యామ్ + 8 జీబీ ర్యామ్
  • 128 జీబీ లేదా 256 జీబీ స్టోరేజ్
  • 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

 చదవండి:

వాట్సాప్‌లో మరో కొత్త స్కామ్ జర జాగ్రత్త!

మరిన్ని వార్తలు