బిగ్ బ్యాటరీతో వస్తున్న గెలాక్సీ ఎఫ్ 62

11 Feb, 2021 19:37 IST|Sakshi

ప్రస్తుతం శామ్సంగ్ కంపెనీ షియోమీకి దీటుగా మొబైల్ ఫోన్లను తీసుకోని వస్తుంది. ఫిబ్రవరి 15న మధ్యాహ్నం 12 గంటలకు శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్62 మొబైల్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి ఫ్లిప్‌కార్ట్ ఒక మైక్రోసైట్‌ను కూడా సృష్టించింది. ఈ సైట్‌లో గెలాక్సీ ఎఫ్62 సంబందించిన కొన్ని ముఖ్యమైన ఫీచర్స్ బహిర్గతం చేసింది. గెలాక్సీ ఎఫ్62లో క్వాడ్-కెమెరా సెటప్, గ్రేడియంట్ గ్రీన్ కలర్ ఆప్షన్, ఎక్సినోస్ 9825 ప్రాసెసర్, సెల్ఫీ కెమెరా కోసం సెంటర్-పొజిషన్డ్ పంచ్-హోల్ కటౌట్ తో వస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్62‌లో 7,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీని తీసుకొస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. గెలాక్సీ ఎం51 తర్వాత ఇంత బ్యాటరీ సామర్థ్యం గల మొబైల్ ఇదే. 

శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్62 ఫీచర్స్:
డిస్ప్లే: 6.7 అంగుళాలు సూపర్ అమోలెడ్
బ్యాటరీ: 7000ఎంఏహెచ్
ర్యామ్: 6జీబీ
స్టోరేజ్: 128జీబీ
ప్రాసెసర్: శామ్సంగ్ ఎక్సినోస్ 9 ఆక్టా 9825 
బ్యాక్ కెమెరా: 64ఎంపీ+ 8ఎంపీ+ 5ఎంపీ + 2ఎంపీ
సెల్ఫీ కెమెరా: 32 ఎంపీ
ఫాస్ట్ ఛార్జింగ్: 25వాట్ 
ఆండ్రాయిడ్ ఓఎస్: ఆండ్రాయిడ్ 11(వన్ యూఐ 3.0)
కలర్స్: గ్రీన్, బ్లూ
కనెక్టివిటీ: 4జీ ఎల్‌టిఇ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపిఎస్, యుఎస్‌బి టైప్-సి

చదవండి:

సోషల్ మీడియాపై సత్య నాదెళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు

పోకో ఎం3 కాసుల వర్షం!

మరిన్ని వార్తలు