శాంసంగ్‌ నుంచి బడ్జెట్‌ ఫోన్‌ వచ్చేసింది

30 Jul, 2020 14:35 IST|Sakshi

రెండు వేరియంట్లలో లాంచ్‌

ఆగస్ట్‌6 నుంచి అమ్మకాలు ప్రారంభం

అమెజాన్‌, శాంసంగ్‌ డాట్‌కామ్‌లో లభ్యం

దక్షిణ కొరియా స్టార్‌ఫోన్ల దిగ్గజం శాంసంగ్‌ భారత మార్కెట్లోకి గురువారం(జూలై 30) కొత్త మోడల్‌ విడుదల చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్‌ గా పిలువబడే ఈ స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్లలో లాంచ్‌ చేసింది. దేశవ్యాప్తంగా ఈ ఆగస్ట్‌ 6వతేది నుంచి అమెజాన్‌, శాంసంగ్‌డాట్‌కామ్‌ లభ్యమవుతాయని కంపెనీ తెలిపింది. అలాగే కొన్ని ఎన్నికోబడిన రిటైల్‌ స్టోర్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంచుతామని తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మిరాజ్‌ బ్లూ, మిరాజ్‌ బ్లాక్‌ రెండు కలర్‌ ఆప్షన్లలో వస్తుంది. బయోమెట్రిక్‌ సదుపాయం కోసం సైడ్‌ - మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. డ్యూయల్‌ సిమ్‌ సౌకర్యం కలదు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత వన్ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ ఫోన్‌లో రివర్స్‌ ఛార్జింగ్‌ సదుపాయం కూడా ఉంది. దీంతో వేరే మొబైల్‌ను రివర్స్ ఛార్జింగ్‌ చేయొచ్చు. సింగిల్‌ టేక్‌ కెమెరా మోడ్‌ ఈ ఫోన్‌ ప్రత్యేకత. ఈ ఫీచర్‌ ద్వారా ఒకేసారి యూజర్లు  ఫొటోలు, వీడియోలు తీసేందుకు వీలవుతుంది. సింగిల్‌ టేక్‌ ఫీచర్‌ శాంసంగ్‌ ప్రీమియం గెలాక్సీ ఫోన్లలో అందుబాటులో ఉంది.


శాంసంగ్‌ గెలాక్సీ ఎం31ఎస్ ఫీచర్లు 

6.5 ఇంచుల ఆల్మోటెడ్‌ పంచ్‌ హోల్‌ డిప్లే
నాలుగు కెమెరాలను కలిగి ఉంది. 
ముందువైపు 32మెగా ఫిక్సెల్‌ సెల్ఫీ కెమెరా 
వెనుక వైపు 3ప్రధాన కెమెరాలున్నాయి.
64+12+5 మెగాఫిక్సెల్‌ సామర్థ్యాన్నికలిగి ఉన్నాయి.
ప్రధాన కెమెరా 64 మెగాపిక్సల్‌ కెపాసిటి,  క్వాడ్‌ రియర్‌ కెమెరా
6000ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం
25W ఫాస్ట్ చార్జింగ్ ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 


శాంసంగ్‌ గెలాక్సీ ఎం31ఎస్‌ ధరలు 

6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌  ధర రూ.19,499
8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌  ధర రూ.21,499
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు