భారీ బ్యాటరీతో శాంసంగ్ గెలాక్సీ ఎం51

10 Sep, 2020 19:19 IST|Sakshi

సాక్షి, ముంబై: శాంసంగ్ స్మార్ట్ ఫోన్ల లాంచింగ్ లో దూకుడు మీద ఉంది. తాజాగా గెలాక్సీ ఎం సిరీస్ లో భారీ  బ్యాటరీ  సామర్ధ్యంతో  మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. 7000 ఎంఏహెచ్  బ్యాటరీతో శాంసంగ్  గెలాక్సీ ఎం51ను భారతీయ మార్కెట్లో ఆవిష్కరించింది.

ధర, లభ్యత, ఆఫర్
6 జీబీ ర్యామ్ వేరియంట్‌  ధర  24,999 రూపాయలు
8 జీబీ ర్యామ్ వేరియంట్‌  26,999 రూపాయలు
సెప్టెంబర్ 18 న మధ్యాహ్నం 12 గంటల నుండి (మధ్యాహ్నం) అమెజాన్, శాంసంగ్.కామ్ , ఇతర రిటైల్ దుకాణాలలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 18-20 మధ్య అమెజాన్ ద్వారా ఫోన్ కొనుగోలు చేసే వినియోగదారులకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులపై 2,000 తగ్గింపు ఆఫర్ చేయనుంది. 

శాంసంగ్ గెలాక్సీ ఎం51 ఫీచర్లు 
6.7అంగుళాల పూర్తి-హెచ్‌డి ప్లస్ సూపర్ అమోలెడ్ ప్లస్ ఇన్ఫినిటీ ఓ డిస్‌ప్లే
ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730 జీ సాక్ 
ఆండ్రాయిడ్ 10 
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3  ప్రొటెక్షన్
6/ 8జీబీ ర్యామ్‌,128 జీబీ స్టోరేజ్ 
512 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం
64+12+5+5 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా
32 మెగాపిక్సెల్ లెన్స్‌తో సెల్ఫీ కెమెరా
7000 ఎంఏహెచ్ బ్యాటరీ  

>
మరిన్ని వార్తలు