Samsung M 52 Review: బడ్జెట్‌ 5 జీ ఫోన్‌ రిలీజ్‌.. అదిరిపోయే ఫీచర్లు ఇవే

6 Oct, 2021 16:11 IST|Sakshi

చైనా కంపెనీలకు దీటుగా మార్కెట్‌లోకి బడ్జెట్‌ ధరలో శామ్‌సంగ్‌ కొత్త ఫోన్లను తీసుకువస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఫోన్‌ శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం 52, 5జీ ఫోన్‌. అమెజాన్‌లో ప్రస్తుతం ఈ ఫోన్‌ బుకింగ్స్‌ మొదలయ్యాయి. అక్టోబరు 10 నుంచి ఈ ఫోన్‌ డెలివరీ కానుంది. ఈ ఫోన్‌కి సంబంధించిన ఫస్ట్‌ రివ్యూ.

బిగ్‌ బ్యాటరీ
శామ్‌సంగ్‌లో ఎం సిరీస్‌ ఫోన్ల బ్యాటరీ సామర్థ్యం ఎక్కువ. అందుకు తగ్గట్టుగానే ఈ ఫోన్‌లో కూడా 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఎం సిరీస్‌లో ఇప్పటి వరకు వచ్చిన ఫోన్లలనీ మీడియం రేంజ్‌ బడ్జెట్‌ ఫోన్లే. కానీ ఎం 52 పాత ఫోన్లకి భిన్నంగా హై ఎండ్‌ ఫీచర్లను కలిగింది ఉంది. 

హై ఎండ్‌ ఫీచర్లు
గెలాక్సీ ఎం 52 ఫోన్‌ 5జీ నెట్‌వర్క్‌ని సపోర్ట్‌ చేస్తుంది. ఇందు కోసం ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 778 జీ ప్రాసెసర్‌ని ఉపయోగించారు. ఈ చిప్‌సెట్‌ 5 జీ నెట్‌వర్క్‌గి బాగా సపోర్ట్‌ చేస్తుంది. దీంతో పాటు ప్రస్తుతం హై ఎండ్‌ ఫోన్లకే పరిమితమైన 120 హెర్జ్‌ స్క్రీన్‌ రీఫ్రెస్‌ రేట్‌ ఇందులో లభిస్తుంది. స్క్రీన్‌ ప్రొటెక‌్షన్‌గా గొరిల్లా గ్లాస్‌ 5ని అమర్చారు. ఇందులో ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ ఉండగా ప్రధాన కెమెరా 64 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతో పాటు కెమెరా అపాచర్‌ 1.8 ఎఫ్‌గా ఉంది. దీని వల్ల తక్కువ వెలుతురులో కూడా ఫోటోలు బాగా తీసుకునే సౌలభ్యం ఉంది.

వర్చువల్‌ రామ్‌
ఇటీవల మార్కెట్‌లో బాగా పాపులర్‌ అయిన వర్చువల్‌ ర్యామ్‌ ఫీచర్‌ని శామ్‌సంగ్‌ అందించింది. శామ్‌సంగ్‌ సంస్థ ర్యామ్‌ ప్లస్‌ పేరుతో వరవ్చుల్‌ ర్యామ్‌ని అందిస్తుంది. ర్యామ్‌మెమెరీ నిండిపోయినప్పుడు వర్చువల్‌ రామ్‌ అప్పటికప్పుడు అదనంగా ర్యామ్‌ని అందిస్తుంది. ఎం 52 మోడల్‌కి సంబంధించి  8 జీబీ ర్యామ్‌ ఫోన్‌లో వర్చువల్‌ ర్యామ్‌గా 4 జీబీ ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది. ఫలితంగా ఫోన్‌ వేగంగా పని చేయడంతో పాటు పాత యాప్స్‌ని, ఫోటోలు, వీడియో, మెసేజ్‌ ఇతర కంటెంట్‌ని డిలీట్‌ చేయాల్సిన ఇబ్బంది తప్పుతుంది. 

బ్లోట్‌వేర్‌
మార్కెట్‌లో గూగుల్‌ పిక్సెల్‌, మోటరోలా ఫోన్లు మాత్రమే స్టాక్‌ ఆండ్రాయిడ్‌ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తున్నాయి, మిగిలిన ఫోన్లలో మనకు అక్కర్లేనివి, ఎక్కువగా ఉపయోగించిన యాప్‌లను ప్రీ ఇన్‌స్టాల్‌గా వస్తున్నాయి. చాలా ఫోన్లలో ఇలాంటి ప్రీ ఇన్‌స్టాల్‌డ్‌ బ్లోట్‌వేర్‌ యాప్స్‌ని తొలగించే అవకాశం ఉండదు. కానీ శామ్‌సంగ్‌ ఎం 52లో బ్లోట్‌వేర్‌ యాప్‌ని అన్‌ఇన్‌స్టాల్‌ చేసుకునే వీలుంది.

సింప్లీ స్లిమ్‌
పవర్‌ ఫుల్‌ బ్యాటరీతో వచ్చే ఎం సిరీస్‌ ఫోన్లు సాధారణంగా ఎక్కువ బరువు ఉంటాయి. కానీ గెలాక్సీ ఎం 52 ఇందుకు విరుద్ధం. హై ఎండ్‌ ఫోన్ల తరహాలో ఇది తక్కువ బరువు ఉండటంతో పాటు స్లిమ్‌గా కూడా కనిపిస్తుంది. ఇక ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 778 జీ ప్రాసెసర్‌ ఉపయోగించడం వల్ల బ్యాటరీ ఆప్టిమైజేషన్‌ బాగుంటుంది. అమోల్‌డ్‌ స్క్రీన్‌, 120 హెర్జ్‌ సెట్టింగ్స్‌తో ఫోన్‌ ఉపయోగించినా త్వరగా బ్యాటరీ డ్రెయిన్‌ కాదు. 

సైడ్‌కి
స్క్రీన్‌పై లేదా ఫోన్‌ వెనుక భాగంలో కాకుండా సైడ్‌కి ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ని అందించారు. పవర్‌ బటనే ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ కలిసే ఉన్నాయి. ఈ ఫీచర్‌పై మిశ్రమ స్పందన వస్తోంది. అమెజాన్‌ గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్‌లో ఈ ఫోన్‌ తగ్గింపు ధరలో లభిస్తోంది. 

స్పెసిఫికేషన్లు 
- స్నాప్‌డ్రాగన్‌ 778 జీ ప్రాసెసర్‌, 5జీ 11 బ్యాండ్‌ సపోర్ట్‌
- 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 25 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జర్‌
- బ్లూటూత్‌, వైఫై, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ
- ఫుల్‌ హెచ్‌డీ, సూపర్‌ అమోల్డ్‌ ప్లస్‌ డిస్‌ప్లే, 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌
- ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌
- 64 ఎంపీ, 12 ఎంపీ, 5 ఎపీ ట్రిపుల్‌ కెమెరా సెటప్‌, 32 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
- హైపర్‌లాప్స్‌, బూమరాంగ్‌ వీడియో ఫీచర్లు,
- మానస్టర్‌ నాక్స్‌ సెక్యూరిటీ ప్లస్‌ ఆల్ట్‌
- బ్లేజింగ్‌ బ్లాక్‌, ఐసీ బ్లూ కలర్లు
- టైప్‌ సీ ఆడియో జాక్‌
- 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ మెమోరి ధర రూ. 25,999
- 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ మెమోరి రూ. 27,999

చదవండి :రూ.60వేల భారీ డిస్కౌంట్‌తో బ్రాండెడ్‌ ల్యాప్‌ ట్యాప్‌

మరిన్ని వార్తలు