శాంసంగ్ గెలాక్సీ నోట్ 20పై భారీ తగ్గింపు

17 Sep, 2020 14:32 IST|Sakshi

గెలాక్సీ నోట్ 20పై  9వేల  తక్షణ డిస్కౌంట్ 

హెచ్‌డీఎఫ్‌సీ  కార్డుపై  6,000 క్యాష్‌బ్యాక్ 

సాక్షి, ముంబై: శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. శాంసంగ్ డేస్ సేల్ లో భాగంగా పలు మొబైళ్లపై తగ్గింపు ధరలను సంస్థ  ప్రకటించింది. ముఖ్యంగా గెలాక్సీ నోట్ 20పై 9 వేల రూపాయల పరిమితకాల తక్షణ డిస్కౌంట్ అందిస్తోంది. దీనికి అదనంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుదారులకు 6,000క్యాష్‌బ్యాక్ కూడా లభ్యం. ఈ ఆఫర్ సెప్టెంబర్ 23వరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది. శాంసంగ్ తోపాటు,  ప్రముఖ ఆన్‌లైన్ పోర్టల్స్ ,రిటైల్ స్టోర్లలో ఈ తగ్గింపును అందిస్తోంది. దీంతోపాటు శాంసంగ్ ఇతర గెలాక్సీ ఫోన్లపై కూడా తగ్గింపు అఫర్లను అందుబాటులో ఉంచింది. 

గెలాక్సీ నోట్ 20 లాంచింగ్ ధర 77,999 రూపాయలు. సేల్ ధర 68,999 రూపాయలు. ఒకవేళ హెచ్‌డీఎఫ్‌సీ  కార్డు ద్వారా కొనుగోలు చేస్తే మరో ఆరువేల తగ్గింపు. మొత్తంగా ఈ స్మార్ట్ ఫోన్ ను 62,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. మిస్టిక్ బ్రాంజ్, మిస్టిక్ గ్రీన్, మిస్టిక్ బ్లూ రంగులలో ఇది లభిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 ఫీచర్లు
6.70 అంగుళాల హెచ్‌డి ఇన్ఫినిటీ-ఓ సూపర్ అమోలెడ్ + ఫ్లాట్ డిస్‌ప్లే
1080x2400 పిక్సెల్స్ రిజట్యూషన్
ఆండ్రాయిడ్ 10
శాంసంగ్ ఎక్సినోస్ 990ప్రాసెసర్ 
10 మెగాపిక్సెల్  సెల్ఫీ కెమెరా
12+64+12మెగాపిక్సెల్ రియర్ ట్రిపుల్ కెమెరా
8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్
4300 ఎంఏహెచ్ బ్యాటరీ 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా