గెలాక్సీ ఎస్‌ 23 అల్ట్రా 5జీ: లాంచింగ్‌ ముందే హల్‌చల్, ఐఫోన్‌కు ఝలక్‌?

18 Jan, 2023 19:29 IST|Sakshi

సాక్షి, ముంబై: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్‌ నెక్స్ట్‌ గెలాక్సీ ఫోన్లను లాంచ్‌ చేయనుంది. ఫిబ్రవరి 1వ తేదీన జరగనున్న అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో గెలాక్సీ ఎస్‌ 23 సిరీస్‌లో మూడు కొత్త ప్రీమియం  స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించేందుకు శాంసంగ్‌ సిద్ధమవుతోంది. భారత్‌తో సహా ప్రపంచ వ్యాప్తంగా వివిధ మార్కెట్‌లలో  ఈ సిరీస్‌ విడుదల కానుంది. ఈ క్రమంలో ధర, డిజైన్, ఫీచర్ల గురించి లీక్‌లు మొదలయ్యాయి.

స్పెసిఫికేషన్ల పరంగా, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌ 23 అల్ట్రా  5జీ  200ఎంపీ ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో  వస్తోంది. 12ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, రెండు 10ఎంపీ టెలిఫోటో సెన్సార్‌తో  రియర్‌ క్వాడ్-కెమెరా మరో ప్రధాన ఆకర్షణ

గెలాక్సీ ఎస్‌ 23 అల్ట్రా 5జీ  ఫీచర్లు
6.8 అంగుళాల 2x డైనమిక్ AMOLED డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2
స్నాప్‌డ్రాగన్ 8 Gen 2
ఆండ్రాయిడ్‌ 13 One UI 5.0
12 ఎంపీ సెల్ఫీ కెమెరా
5000mAh బ్యాటరీ 45 వాట్ ఛార్జింగ్ 
ధర (అంచనా) రూ. 1,14,990 

యాపిల్‌ ఐఫోన్‌14 ప్రో మాక్స్‌కు షాక్‌?
అయితే యాపిల్‌ 14 ప్రో మాక్స్‌తో పోలిస్తే 8జీబీ ర్యామ్‌ సహా, 200 ఎంపీ కెమెరా, డిస్‌ప్లే చివరికి ధర విషయంలో  కూడా మెరుగ్గా ఉన్న శాంసంగ్‌ కొత్త స్మార్ట్‌ ఫోన్‌, యాపిల్‌కు గట్టి పోటీ ఇవ్వనుందని పలు అంచనాలు మార్కెట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.  

మరిన్ని వార్తలు