శాంసంగ్‌ యూజర్లకు అలర్ట్‌...! వీటితో జాగ్రత్త..!

28 Dec, 2021 16:11 IST|Sakshi

శాంసంగ్‌ యూజర్లకు అలర్ట్‌..! శాంసంగ్‌ గెలాక్సీ స్టోర్‌లో మాల్‌వేర్‌ ఆధారిత యాప్స్‌ ఉన్నాయని ప్రముఖ ఆన్‌లైన్‌ టెక్‌ పబ్లికేషన్స్‌ ఆండ్రాయిడ్‌ పోలీస్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. 

శాంసంగ్‌ మొబైల్‌ స్మార్ట్‌ఫోన్‌లోని ప్రతి గెలాక్సీ స్టోర్‌లో ఈ మాల్‌వేర్స్‌ ఉన్నట్లు ఆండ్రాయిడ్‌ పోలీస్‌ ఒక ప్రచురణలో పేర్కొంది. నివేదిక ప్రకారం....స్ట్రీమింగ్ యాప్స్‌ల్లో  మాల్వేర్‌ను కలిగి ఉండవచ్చునని అభిప్రాయపడింది. శాంసంగ్ గెలాక్సీ స్టోర్‌లో  షోబాక్స్ యాప్ అనేక క్లోన్‌(నకిలీ)యాప్స్‌ను కలిగి ఉందని పేర్కొంది. షోబాక్స్‌ యాప్‌ ఒక మూవీ, టీవీ సిరీస్‌లను ఉచితంగా అందించే ప్రసిద్ధ యాప్. షోబాక్స్ యాప్‌ తరహ సుమారు ఐదు నకిలీ యాప్స్‌ స్టోర్‌లో ఉన్నాయని ఆండ్రాయిడ్‌ పోలీస్‌ తన నివేదికలో పేర్కొంది. ఈ నకిలీ యాప్స్‌ అత్యంత ప్రమాదకమైనవని వెల్లడించింది. కొన్ని యాప్స్‌ కాల్ లాగ్స్‌, కాంటాక్ట్స్, టెలిఫోన్‌కు యాక్సెస్‌తో సహా అనవసరమైన అనుమతులను కూడా యూజర్‌ ప్రమేయం లేకుండా  తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇలాంటి సమస్య గతంలో హువావే స్మార్ట్‌ఫోన్లలో తలెత్తింది. అప్పట్లో డజనుపైగా  హెచ్చరికలను జారీ చేశారు.  

మీ స్మార్ట్‌ఫోన్‌ను రక్షించుకోవడానికి ఇలా  చేయండి...?

  • ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో మాల్‌వేర్‌తో నిండిన యాప్స్‌ను ఏదైనా ఇన్‌స్టాల్ చేశారో లేదో ముందుగా చెక్ చేసి, వెంటనే వాటిని తీసివేయాలి. ఇది ఎలా సాధ్యమౌతుందంటే గూగుల్‌ ప్లే ప్రోటెక్ట్‌ను ఆన్‌ చేయగానే..ఆయా యాప్స్‌ ప్రమాదకరమైనవని గూగుల్‌ సూచిస్తుంది. 
  • యూజర్లు కాస్పర్‌స్కై, నోర్టన్‌ 360 వంటి యాంటీ వైరస్‌ యాప్స్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ఇన్‌స్టాల్ చేసుకుంటే మంచింది. కొన్ని యాప్స్‌ పరిమిత కాలపు వరకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తాయి. 
  • మీకు కావాల్సిన యాప్స్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచే కాకుండా ఆయా యాప్స్‌ అధికారిక వెబ్‌సైట్స్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేయడం ఉత్తమం. థర్డ్‌ పార్టీ యాప్స్‌ జోలికి వెళ్లకపోవడం మంచింది. 

చదవండి: ఆండ్రాయిడ్‌ యూజర్లకు అలర్ట్‌..! ఈ యాప్స్‌ ఫోన్‌లో ఉంటే..మీ ఖాతాలు ఖాళీ..!
చదవండి: 200 కోట్ల యూజర్లకు పెను ప్రమాదం..! గూగుల్‌ హెచ్చరిక..!

మరిన్ని వార్తలు