ఆకట్టుకునే ఫీచర్లు, మార్కెట్‌లో విడుదలైన మరో స్మార్ట్‌ ఫోన్‌

11 Sep, 2021 21:07 IST|Sakshi

సౌత్‌ కొరియా స్మార్ట్‌ ఫోన్‌ తయారీ దిగ్గజం శాంసంగ్‌ 'గెలాక్సీ వైడ్‌5' ఫోన్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫోన్‌ సౌత్‌ కొరియాలో అందుబాటులో ఉండగా త్వరలో మిగిలిన దేశాల్లో విడుదల కానున్నట్లు శాంసంగ్‌ ప్రతినిధులు వెల్లడించారు. 

ఫోన్‌ స్పెసిఫికేషన్స్‌..
6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఇన్‌ఫినిటీ-వీ డిస్ ప్లే,ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌,ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. బ్యాటరీ సామర్ధ్యం 5000 ఎంఏహెచ్‌, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. వీటితో పాటు వాట‌ర్ డ్రాప్ త‌ర‌హా డిస్ ప్లే స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలువ నుంది. 

శాంసంగ్ గెలాక్సీ వైడ్ 5 ధ‌ర‌
ప్రస్తుతానికి  శాంసంగ్ గెలాక్సీ వైడ్ 5 ఒక్క వేరియంట్‌ మాత్రమే అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ తో విడుదలైన ఈ ఫోన్‌ ధర ఇండియన్‌ కరెన్సీ ప్రకారం రూ.28,200గా ఉంది. బ్లాక్, బ్లూ, వైట్ రంగుల్లో ఈ స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు.

చదవండి: ఐఫోన్‌ యూజర్లకు ఆపిల్‌ హెచ్చరికలు ! అందులో నిజమెంత?

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు