దుమ్ము లేపుతుంది, భారత్‌లో ఎక్కువగా అమ్ముడవుతున్న 5జీ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే

5 Nov, 2022 17:17 IST|Sakshi

ఫెస్టివల్‌ సీజన్‌లో తమ సంస్థకు చెందిన ఫోన్‌లు భారత్‌లో భారీగా అమ్ముడు పోయినట్లు ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ శాంసంగ్‌ తెలిపింది. సెప్టెంబర్- అక్టోబర్ మధ్య కాలంలో రూ.14,400 కోట్ల విలువైన ఫోన్‌లను అమ్మినట్లు వెల్లడించింది. 2022 మొదటి మూడు త్రైమాసికాలలో ప్రీమియం కేటగిరీ స్మార్ట్‌ఫోన్‌లలో 99 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు కంపెనీ సీనియర్ అధికారి ప్రకటించారు. 

ఈ సందర్భంగా శాంసంగ్‌ ఇండియా సీనియర్ డైరెక్టర్, ప్రొడక్ట్ మార్కెటింగ్ హెడ్ ఆదిత్య బబ్బర్ మాట్లాడుతూ..ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుండి కేవలం 60 రోజుల వ్యవధిలో రూ.14,400 కోట్లను ఆర్జించినట్లు చెప్పారు. జనవరి - సెప్టెంబర్ మధ్య కాలంలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ విలువ పరంగా సంవత్సరానికి ప్రాతిపదికన కంపెనీ 178 శాతం అమ్మకాలు జరిపిందని అన్నారు. గతేడాది పండుగ సమయంలో జరిగిన అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది సంస్థ వృద్ధి రెండంకెల స్థాయికి చేరుకుందన్నారు. 

సంస్థ వృద్ధికి దోహదపడిన వాటిలో ‘శాంసంగ్ (ఫోన్‌లపై ఫైనాన్స్‌) ఫైనాన్స్ ప్లస్’ ఒకటని చెప్పారు. పండుగ సీజన్‌లో ఈ ప్లాట్‌ఫారమ్‌లో లావాదేవీలు 3 రెట్లు వృద్ధితో 10 లక్షలకు పైగా ట్రాన్సాక్షన్‌లు జరిగాయని పునరుద్ఘాటించారు.  

చదవండి👉 ఆకాష్‌ అంబానీ మాస్టర్‌ ప్లాన్‌ అదిరింది, జియో యూజర్లకు బంపరాఫర్‌

ఎక్కువగా అమ్ముడవుతున్న 5జీ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే
వినియోగదారులు ఎక్కువ 5జీ, ప్రీమియం ఫోన్‌లను కొనుగోలు చేస్తున్నారు. రూ.10,900 నుంచి 5జీ ప్రారంభ ధర ఫోన్‌లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. సంస్థ సుమారు 20 రకాల మోడళ్లలో 5జీ నెట్‌వర్క్‌ను వినియోగించుకునే సౌకర్యాన్ని కల్పించింది. నవంబర్ 15 నాటికి కంపెనీ అన్ని 5జీ ఫోన్‌లలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను విడుదల చేస్తుందని, చాలా స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పటికే 5జీ సేవల్ని వినియోగించేకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు బబ్బర్ తెలిపారు.  

కౌంటర్‌ పాయింట్ రీసెర్చ్‌
కౌంటర్‌ పాయింట్ రీసెర్చ్‌ ప్రకారం..జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో వాల్యూమ్ పరంగా 18 శాతం మార్కెట్ వాటాతో భారతదేశంలో రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ విక్రయదారుగా నిలిచింది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్‌గా స్థానాన్ని దక్కించుకుంది.

చదవండి👉 ఫోన్‌ల జాబితా వచ్చేసింది, ఎయిర్‌టెల్‌ 5జీ నెట్‌ వర్క్‌ పనిచేసే స్మార్ట్‌ ఫోన్‌లు ఇవే!

మరిన్ని వార్తలు