Samsung: దేశంలో 5జీ జోరు, వందల కోట్ల పెట్టుబడి పెట్టనున్న శాంసంగ్‌

26 Nov, 2022 18:58 IST|Sakshi

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ శాంసంగ్‌ భారత్‌లో రూ.400​ కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఆ ఇన్వెస్ట్‌మెంట్‌తో తమిళనాడు కేంద్రంగా 4జీ, 5జీ రేడియో ఎక్విప్‌మెంట్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను నెలకొల్పనుంది. ఇందుకోసం జియో, ఎయిర్‌టెల్‌తో చేతులు కలపనున్నట్లు తెలుస్తోంది. 

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్‌తో పాటు మిగిలిన అంతర్జాతీయ సంస్థలు  ప్రొడక్ట్‌లను తయారు చేసేలా కేంద్ర ప్రభుత్వ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకంలో చేరారు. ఈ ఏడాది అక్టోబర్‌లో పీఎల్‌ఐ స్కీమ్‌లో భాగంగా తయారీ సంస్థలు నెలకొల్పేలా నోకియా, శామ్‌సంగ్, ఎరిక్సన్ భాగస్వామి జబిల్ దేశీయంగా 5జీ పరికరాల్ని తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. 

దేశంలో 5జీ జోరు
రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ను విడుదల చేయడంతో 5జీ పరికరాలకు డిమాండ్ పెరగనుంది. అయితే గతేడాది పరికరాలు సరఫరా చేసే అవకాశాలు లేకపోవడంతో  పీఎల్‌ఐ స్కీమ్‌లో చేరేందుకు శాంసంగ్ ఇష్టపడేలేదు. కేవలం జియోకు 4జీ పరికరాల్ని అందించే సంస్థగా కొనసాగింది. కానీ తాజాగా భారత్‌లో 5జీ రాకతో లేటెస్ట్‌ టెక్నాలజీ ఎక్విప్‌మెంట్‌ అవసరం పెరిగింది. దీంతో శాంసంగ్‌ పీఎల్‌ఐ స్కీంలో చేరి భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది.

మరిన్ని వార్తలు