స్టార్టప్స్‌కు శామ్‌సంగ్‌ అదిరిపోయే ఆఫర్‌!

10 Dec, 2022 08:00 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రభుత్వ డిజిటల్‌ భారత ప్రయాణంలో పాలుపంచుకుంటున్న స్టార్టప్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోనున్నట్టు కంజ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ శామ్‌సంగ్‌ తెలిపింది. యూపీఐ, డిజిలాకర్, ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్, ఓపెన్‌ క్రెడిట్‌ ఎనేబుల్‌మెంట్‌ నెట్‌వర్క్, యూనిఫైడ్‌ హెల్త్‌ ఇంటర్‌ఫేస్‌ వంటి సాంకేతికతలపై కలిసి పనిచేసేందుకు స్టార్టప్స్‌ను ఆహ్వానిస్తోంది.

ఇందులో భాగంగా వాలెట్, హెల్త్, ఫిట్‌నెస్‌ వంటి డొమైన్‌లలో భారత్‌లోని శామ్‌సంగ్‌ పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు, వ్యాపార విభాగాలతో స్టార్టప్‌లు భాగస్వాములవుతాయి. ఉత్పత్తులు, సేవలు శామ్‌సంగ్‌ వ్యవస్థతో అనుసంధానిస్తారు. అవసరమైతే నిధులను సైతం సమకూరుస్తారు.    

మరిన్ని వార్తలు