Samsung: షాపింగ్‌ కోసం వాట్సాప్‌ అపాయింట్‌మెంట్‌.. రివార్డు పాయింట్లు కూడా

13 Jun, 2021 16:51 IST|Sakshi

న్యూఢిల్లీ: కస్టమర్ల సేఫ్టీ కోసం శాంసంగ్‌ సులువైన సౌకర్యాన్ని తీసుకొచ్చింది. కరోనా టైంలో షోరూమ్‌ల దగ్గర కస్టమర్ల క్యూ తాకిడిని తగ్గించేందుకు వీ కేర్‌ ప్రొగ్రాం కింద ఓ ఫీచర్‌ను తెచ్చింది. దాని పేరు ‘షాప్‌ బై అపాయింట్‌మెంట్‌’. శాంసంగ్‌ ప్రొడక్ట్స్‌ ఏవైనా కొనాలంటే ఇకపై కస్టమర్లు షోరూమ్‌ దగ్గర వేచిచూడాల్సిన అవసరం లేకుండా.. ముందుగా ఆన్‌లైన్‌ అపాయింట్‌మెంట్‌ బుక్‌ చేసుకోవచ్చు. 

ముందుగా శాంసంగ్‌ షాప్‌ బై అపాయింట్‌మెంట్‌ పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని ప్రకారం.. కస్టమర్లకు దగ్గర్లో ఉన్న శాంసంగ్‌ ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్స్‌లో ఫలానా తేదీ, ఫలానా టైంకి అపాయింట్‌మెంట్‌ ఇస్తారు. అంతేకాదు శాంసంగ్‌ స్మార్ట్‌ కేఫ్‌లలో అపాయింట్‌మెంట్‌ కోసం 9870494949 నెంబర్‌కు వాట్సాప్‌ చేసి.. కొన్ని స్టెప్స్‌ ఫాలో కావాలి. ఆ తర్వాత వాళ్లు అపాయింట్‌మెంట్‌ ఇచ్చే టైంకి షోరూంకి వెళ్లి.. ఎగ్జిక్యూటివ్‌తో నేరుగా ఇంటెరాక్ట్‌ అయ్యి కావాల్సిన ప్రొడక్ట్‌ గురించి తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్‌ ద్వారా కస్టమర్ల మధ్య ఫిజికల్‌ డిస్టెన్స్‌ తేలికగా అమలు అవుతుందని కంపెనీ భావిస్తోంది. ఈ వాట్సాప్‌ చాట్‌బోట్‌ ద్వారా డివైజ్‌ల వివరాలు, లేటెస్ట్‌ ఆఫర్లు, దగ్గర్లోని స్టోర్‌ల వివరాలు తెలుసుకోవచ్చు. హోం డెలివరీ, హోం డెమో సర్వీసులను కస్టమర్లు అందుకోవచ్చు. అవసరమైన చెల్లింపులను డిజిటల్‌ పే ద్వారా చేయొచ్చు. ఈ-ఇన్‌వాయిస్‌లను వాట్సాప్‌ ద్వారానే పొందవచ్చు. 

ఇక ఈ సర్వీస్‌ల ద్వారా ప్రొడక్టులను కొనే కస్టమర్లకు 1000 రూ. దాకా రివార్డు పాయింట్లు ఇస్తారు. ఈ పాయింట్లు శాంసంగ్‌ స్మార్ట్‌ క్లబ్‌ వాలెట్‌లో జమ అవుతుంది. ఈ సర్వీస్‌ ద్వారా గేలక్సీ ట్యాబ్స్‌, స్మార్ట్‌ వాచీలు, బడ్స్‌ మీద స్టూడెంట్స్‌కి స్పెషల్‌ డిస్కౌంట్‌ లభించనుంది. వీటితోపాటు అదనంగా రిఫరెల్‌ అడ్వాంటేజ్‌  ప్రోగ్రాం కింద ఆఫర్లు వర్తించే ఫోన్లపై రూ. 7500 రిఫరల్‌ బెనిఫిట్‌(రిఫరెన్స్‌ చేయడం ద్వారా) కస్టమర్లకు దక్కుతుంది.

చదవండి: వాట్సప్‌ సమస్యలపై గ్రీవెన్స్ ఆఫీసర్‌కి కంప్లైంట్ చేయడం ఎలా?

మరిన్ని వార్తలు