శాంసంగ్‌ మళ్లీ ఈ వ్యాపారంలోకి రీ ఎంట్రీ

18 Mar, 2022 10:34 IST|Sakshi

Samsung Laptops India, న్యూఢిల్లీ: కరోనా కారణంగా వర్క్‌ఫ్రం హోం కల్చర్‌ పెరగడంతో కంప్యూటర్ల వినియోగం ఎక్కువైంది. ఉద్యోగులకు ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌లు తప్పనిసరిగా మారిపోయాయి. దీంతో గత రెండేళ్లలో పర్సనల్‌ కంప్యూటర్‌ మార్కెట్‌ పెరిగింది. దీనికి అనుగుణంగా శామ్‌సంగ్‌ తన వ్యాపార ప్రణాళికల్లో మార్పులు చేసింది.

మార్చి 18
 కొరియన్‌ ఎల్రక్టానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌ భారత్‌లో మళ్లీ పర్సనల్‌ కంప్యూటర్ల (పీసీ) విభాగంలోకి అడుగుపెట్టింది. గెలాక్సీ బుక్‌ నోట్‌బుక్స్‌ సిరీస్‌ను ఆవిష్కరించింది. వీటికి మార్చి 18 నుంచి ప్రీ–బుకింగ్‌ ప్రారంభమవుతుంది. ధర రూ. 38,990–1,16,000 శ్రేణిలో ఉంటుంది. అత్యుత్తమ పనితీరు కనబర్చేలా వీటిని తీర్చిదిద్దినట్లు శాంసంగ్‌ ఇండియా సీనియర్‌ వైస్‌–ప్రెసిడెంట్‌ (మొబైల్‌ విభాగం) రాజు పులన్‌ తెలిపారు. పీసీ విభాగంలో ఈ ఏడాది రెండంకెల స్థాయి మార్కెట్‌ వాటా దక్కించుకోవాలని నిర్దేశించుకున్నట్లు శాంసంగ్‌ ఇండియా జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ పోస్వాల్‌ ఇటీవలే వెల్లడించారు. 

భారీ వృద్ధి
డేటా కన్సల్టెన్సీ సంస్థ ఐడీసీ గణాంకాల ప్రకారం.. భారత్‌లో సంప్రదాయ పీసీల మార్కెట్‌ (డెస్క్‌టాప్‌లు, నోట్‌బుక్‌లు, వర్క్‌స్టేషన్లు మొదలైనవి) 2020తో పోలిస్తే 2021లో 44.5 శాతం వృద్ధి చెందింది. కంపెనీలు, వినియోగదారుల నుంచి డిమాండ్‌ నెలకొనడంతో డెస్క్‌టాప్‌ల అమ్మకాలు 30 శాతం వృద్ధిని నమోదు చేశాయి.  దీంతో శామ్‌సంగ్‌ ఈ మార్కెట్‌పై దృష్టి సారించింది.
 

మరిన్ని వార్తలు