షావోమికి షాకిచ్చిన శాంసంగ్

7 Aug, 2020 16:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి, ఇండో -చైనా ఆందోళనల నడుమ  చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమికి భారీ షాక్ తగిలింది. భారతీయ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ లో రారాజులా దూసుకుపోయిన షావోమికి చైనా బ్యాన్ సెగ తాకింది. దీంతో  మొత్తం భారతీయ  స్మార్ట్ ఫోన్ మార్కెట్లో టాప్ ప్లేస్ ను కోల్పోయింది.  పరిశోధనా సంస్థ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ డేటా (ఐడీసీ) ప్రకారం దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తిరిగి అగ్రభాగానికి దూసుకొచ్చింది.  (శాంసంగ్ 5జీ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్: అంచనాలు)

ఐడీసీ డేటా ప్రకారం దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ మార్కెట్లో అగ్రస్థానంలో నిలిచింది. జూన్-ముగిసిన త్రైమాసికంలో 29.1 శాతం మార్కెట్ వాటాను  సాధించగలిగింది. అంతకుముందు త్రైమాసికంలో ఇది 15.6 శాతం  మాత్రమే. ప్రధానంగా గెలాక్సీ ఎం 21 స్మార్ట్‌ఫోన్  టాప్ 5 మోడళ్లలో ఒకటిగా ఉందని తెలిపింది.  29 శాతం మార్కెట్ షేర్ తో షావోమి, 17.5 శాతంతో వివో ఆ తరువాతి స్థానాలో ఉన్నాయి.  అయితే ఫీచర్ ఫోన్ ప్లస్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శాం‌సంగ్ 24 శాతం వాటాతో  షావోమి, వివో కంటే వెనక బడి వుంది. అలాగే ఆన్ లైన్ వ్యాపారంలో శాంసంగ్ రెండవ స్థానంతో సరిపెట్టుకుంది. (రెడ్‌మీ 9 ప్రైమ్ లాంచ్ : అందుబాటు ధరలో)

షావోమి ఎగుమతులు 48.7శాతం తగ్గి (2 క్యూ 20 లో) 5.4 మిలియన్ యూనిట్లకు పడిపోయాయి. నాల్గవ స్థానంలో ఉన్న రియల్‌మీ  37శాతం క్షీణించి 1.78 మిలియన్ యూనిట్లను రవాణా చేసింది. ఐదవ స్థానంలో ఉన్న ఒప్పో  ఎగమతులు క్యూ 2లో 51శాతం పడిపోయి 1.76 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. మార్కెట్ లీడర్ గా శాంసంగ్  ఉండటం తాత్కాలికమే కావచ్చని ఐడీసీ ఇండియా పరిశోధనా డైరెక్టర్ నవకేందర్ సింగ్ వ్యాఖ్యానించారు.  చైనా వ్యతిరేక సెంటిమెంట్ కు తోడు,  చైనా స్మార్ట్ ఫోన్ అమ్మకం దారుల వద్ద స్టాక్ కొరత శాంసంగ్ లాభాలకు దోహదపడిందన్నారు. లేదంటే వివో సులభంగా  రెండవ స్థానానికి చేరుకునేదన్నారు. మొత్తంగా ఇండియా స్మార్ట్ ఫోన్ మార్కెట్ 2020 రెండవ త్రైమాసికంలో గత ఏడాదితో 36.8 మిలియన్ యూనిట్ల పోలిస్తే  50.6శాతం  క్షీణించి 18.2 మిలియన్ యూనిట్లకు పడిపోయిందని ఐడీసీ తెలిపింది. ఫీచర్ ఫోన్ ఎగుమతులు 2 క్యూ 20 లో సంవత్సరానికి 69 క్షీణించి 10 మిలియన్ యూనిట్లకు తగ్గాయని అసోసియేట్ రీసెర్చ్ మేనేజర్ ఉపాసనా జోషి తెలిపారు.  రాబోయే పండుగ సీజన్ నేపథ్యంలో 2020 ద్వితీయార్ధంలో మార్కెట్ రికవరీ సంకేతాలున్నాయని  ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు