యాపిల్‌కు శాంసంగ్‌ భారీ షాక్‌!

31 May, 2022 11:56 IST|Sakshi

ప్రముఖ సౌత్ కొరియా ఎలక్ట్రానిక్‌ దిగ్గజం శాంసంగ్‌ గ్లోబల్‌ మార్కెట్‌పై ఆదిపత్యం చెలాయిస్తుంది. బడ్జెట్‌ ధర, ఆకట్టుకునే ఫీచర్లతో సరికొత్త మోడళ్లతో స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేసింది. దీంతో యూజర్లు ఆ బ్రాండ్‌ ఫోన్‌లను ఎక్కువగా కొనుగోలు చేయడంతో వరల్డ్‌ వైడ్‌గా శాంసంగ్‌ స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌ షేర్‌ ఎక్కువగా ఉందని కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ తెలిపింది. 


ఈ ఏడాది క్యూ1 ఫలితాల్లో (క్యూ1) 24 శాతంతో బెస్ట్‌ సెల్లింగ్‌ స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌గా శాంసంగ్‌ నిలిచినట్లు కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ తన నివేదికలో పేర్కొంది. 2017 తరువాత ఈ స్థాయిలో స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు దారుల్ని ఆకట్టుకునేందుకు శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌ 22 సిరీస్‌లాంటి మిడ్‌ రేంజ్‌ ఫోన్‌లే కారణమని వెల్లడించింది. 

క్యూ1 ఫలితాల్లో 
2017లో గ్లోబల్‌ స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌లో శాంసంగ్‌ షేర్‌ 25శాతంగా ఉంది. మళ్లీ 5ఏళ్ల తర్వాత అంటే ఈ ఏడాది క్యూ1లో 24శాతం షేర్‌తో ప్రథమ స్థానంలో నిలిచింది. శాంసంగ్‌ తర్వాత ఆండ్రాయిండ్‌ బ్రాండ్‌లలో షావోమీ 12శాతం, ఐఫోన్‌ మార్కెట్‌లో యాపిల్‌ 15శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 

ప్రొడక్షన్‌ తగ్గించేసింది
క్యూ1 ఫలితాల అనంతరం ప్రపంచ దేశాల్లో తలెత్తిన ఆర్ధిక మాంధ్యం, కరోనా లాక్‌ డౌన్‌, రష్యా- ఉక్రెయిన్‌ యుద‍్ధం, చిప్‌ షార్టేజ్‌తో పాటు వివిధ కారణాల వల్ల స్మార్ట్‌ ఫోన్‌లను తయారీ శాంసంగ్‌ స్మార్ట్‌ ఫోన్‌ల తయారీని తగ్గించినట్లు తేలింది. ప్రపంచంలో అత్యధికంగా స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థగా కొనసాగుతున్న శాంసంగ్‌ ఈ ఏడాది 30 మిలియన‍్ల స్మార్ట్‌ ఫోన్‌ ప్రొడక్షన్‌ను తగ్గిస్తుందని సౌత్‌ కొరియా బిజినెస్‌ మీడియా సంస్థ 'మెయిల్‌' తన కథనంలో పేర్కొంది. కాగా, ఇప్పటికే యాపిల్‌ సైతం 20 మిలియన్‌ ప్లస్‌ ఫోన్‌ల ప్రొడక్షన్‌ను తగ్గిస్తున్నట్లు తెలిపిందని బ్లూం బర్గ్‌ రిపోర్ట్‌ హైలెట్‌ చేసింది.

ఫీచర్‌ ఫోన్‌లకు గుడ్‌బై!
శాంసంగ్‌కు చెందిన ఖరీదైన స్మార్ట్‌ ఫోన్‌ భారత్‌లో ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. అందుకే హై బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్‌ సేల్స్‌ పెంచేందుకు భారత్‌లో ఫీచర్‌ ఫోన్‌ల అమ్మకాలను నిలిపిస్తూ ప్రకటించిన విషయం తెలిసిందే.

చదవండి👉 భారత్‌కు శాంసంగ్‌ భారీ షాక్‌! ఇకపై ఆ ప్రొడక్ట్‌లు ఉండవట!

మరిన్ని వార్తలు