శామ్‌సంగ్‌... గూగుల్‌.. ఓ స్మార్ట్‌ వాచ్‌

29 Jun, 2021 12:03 IST|Sakshi

శామ్‌సంగ్‌ నుంచి కొత్త స్మార్ట్‌ వాచ్‌ 

శామ్‌సంగ్‌, గూగుల్‌ కలయికలో అధునాత ఫీచర్లతో స్మార్ట్‌ వాచ్‌ రాబోతుంది. టెకీలు, ఫిట్‌నెస్‌ లవర్లు, స్పోర్ట్స్‌ పర్సన్‌ అవసరాలను తీర్చే విధంగా సరికొత్త ఫీచర్లు ఈ వేరబుల్‌ గాడ్జెట్‌లో పొందు పరిచారు. దీనికి సంబంధించిన వివరాలను మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లో శామ్‌సంగ్‌ వెల్లడించింది. 

గూగుల్‌​ ప్లస్‌ శామ్‌సంగ్‌
ఇప్పటి వరకు శామ్‌సంగ్‌ విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్లు అన్నీ టైజన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పని చేశాయి. ఈసారి టైజన్‌ స్థానంలో గూగుల్‌ రూపొందించిన యూఐ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ని శామ్‌సంగ్‌ ఉపయోగిస్తోంది. దీని వల్ల ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫామ్‌పై పని చేసే ఫోన్లకు, ఈ స్మార్ట్‌ వాచ్‌కి మధ్య కనెక్టివి మరింత మెరుగ్గా ఉంటుందని శామ్‌సంగ్‌ చెబుతోంది. 

ఆధునిక ఫీచర్లు
మొబైల్‌ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునే యాప్స్‌ ఆటోమేటిక్‌గా స్మార్ట్‌ వాచ్‌లో డౌన్‌లోడ్‌ అయిపోతాయి. స్మార్ట్‌వాచ్‌లో వివిధ దేశాల టైమ్‌ జోన్‌, కాల్‌ బ్లాక్‌ తదితర ఆప్షన్లను అందివ్వబోతుంది శామ్‌సంగ్‌. దీంతో పాటు స్మార్ట్‌వాచ్‌ బ్యాటరీ సామర్థ్యం కూడా పెరగనుంది. ముఖ్యంగా టెకీలు, బిజినెస్‌ పర్సన్స్‌ ఏదైనా సమావేశంలో ఉన్నప్పుడు కాల్‌ బ్లాక్‌, అన్‌ బ్లాక్‌ చేయడానికి స్మార్ట్‌వాచ్‌లో కొత్తగా వచ్చిన అప్లికేషన్‌ ఎంతగానో ఉపయోగకరమని శామ్‌సంగ్‌ చెబుతోంది,. ఆగస్టులో ఈ స్మార్ట్‌వాచ్‌ రిలీజ్‌ చేసే అవకాశం ఉంది.

చదవండి : లీకైన వన్ ప్లస్ నార్డ్ 2 కెమెరా, డిస్ప్లే ఫీచర్లు

మరిన్ని వార్తలు