SAMSUNG WMC: ఫోకస్‌ అంతా వాటిపైనే

28 Jun, 2021 15:23 IST|Sakshi

వరల్డ్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ వేదికగా కొత్త అప్‌డేట్స్‌ ప్రకటించేందుకు సామ్‌సంగ్‌ సిద్ధమైంది. కోవిడ్‌ కారణంగా వర్చువల్‌ పద్దతిలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. జూన్‌ 28 రాత్రి 7:15 గంటలకు వరల్డ్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ ప్రారంభం కానుంది. సామ్‌సంగ్‌ యూట్యూబ్‌ ఛానల్‌, సామ్‌సంగ్‌ న్యూస్‌రూమ్‌ లైట్‌ల ద్వారా ఈ వర్చువల్‌ సమావేశాన్ని చూడొచ్చు.

స్మార్ట్‌వాచ్‌ అప్‌డేట్స్‌
ఈరోజు జరిగే మొబైల్‌ కాంగ్రెస్‌లో స్మార్ట్‌ వాచెస్‌పై  సామ్‌సంగ్‌ ఎక్కువగా ఫోకస్‌ చేయబోతుంది. స్మార్ట్‌ వాచెస్‌ మరింత సమర్థంగా, ఉపయోగకరంగా పని చేసేలా ప్రయత్నించాలంటూ డెవలపర్స్‌కి ఇప్పటికే సామ్‌సంగ్‌ సూచించింది. ప్రస్తుతం స్మార్ట్‌ వాచెస్‌లో సామ్‌సంగ్‌ సొంత ఆపరేటింగ్‌ సిస్టమ్‌ టైజన్‌ వాడుతుండగా.. ఇకపై  వియర్‌ ఓస్‌కు షిఫ్ట్‌ కానుంది. ఇందుకు సంబంధించిన అప్‌డేట్స్‌ని ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది. దీంతో పాటు గెలాక్సీ వాచ్‌ 4కి సంబంధించి సామ్‌సంగ్‌ ప్రకటన చేసే అవకాశం ఉంది. 

కొత్త ఫీచర్లేంటీ ?
స్మార్ట్ వాచెస్‌తో పాటు ఆగస్టులో విడుదల చేయనున్న సామ్‌సంగ్‌ గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 3, సామ్‌సంగ్‌ జెడ్‌ ఫ్లిప్‌ 3, సామ్‌సంగ్‌ గెలాక్సీ టాబ్‌ ఎస్‌ 8లలో పొందుపరిచిన సరికొత్త ఫీచర్లకు సంబంధించిన వివరాలను ఈ వర్చువల్‌ సమావేశంలో సామ్‌సంగ్‌ వెల్లడించనుంది. 

చదవండి : Tesla Electric Cars: టెస్లాకు భారీ దెబ్బ...!

మరిన్ని వార్తలు