సన్మార్‌ గ్రూపు చైర్మన్‌ శంకర్‌ అస్తమయం

18 Apr, 2022 00:56 IST|Sakshi

చెన్నై: సన్మార్‌ గ్రూపు చైర్మన్‌ ఎన్‌.శంకర్‌ (77) అనారోగ్య కారణాలతో ఆదివారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. శంకర్‌ సోదరుడు ఎన్‌.కుమార్‌ కంపెనీకి వైస్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. శంకర్‌ కుమారుడు విజయ్‌ శంకర్‌ డిప్యూటీ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. అసోచామ్‌ ప్రెసిడెంట్, ఇండో–యూఎస్‌ జాయింట్‌ బిజినెస్‌ కౌన్సిల్, మద్రాస్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఇలా ఎన్నో సంఘాల్లో శంకర్‌ పనిచేశారు. ఎన్నో సామాజిక, సేవా కార్యక్రమాలకు ఆయన మద్దతుగా నిలిచారు. శంకర్‌ మృతి పట్ల ప్రముఖ పారిశ్రామికవేత్తలు సంతాపం తెలియజేశారు. ఆధునిక యాజమాన్య విధానాలను చాలా ముందుగా అందిపుచ్చుకున్న వ్యక్తి శంకర్‌ అని టీవీఎస్‌ గ్రూపు గౌరవ చైర్మన్‌ వేణు శ్రీనివాసన్‌ చెప్పారు. సన్మార్‌ గ్రూపు ఇండస్ట్రియల్‌ కెమికల్స్‌లో ప్రముఖ కంపెనీగా ఎదిగింది. భారత్‌ సహా అమెరికా, మెక్సికో, ఈజిప్ట్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.  

మరిన్ని వార్తలు