సఫైర్‌ ఫుడ్స్‌ ఐపీవో సక్సెస్‌

12 Nov, 2021 04:53 IST|Sakshi

ఇష్యూకి 6.6 రెట్లు అధిక స్పందన

న్యూఢిల్లీ: కేఎఫ్‌సీ, పిజ్జా హట్‌ ఔట్‌లెట్ల నిర్వాహక కంపెనీ సఫైర్‌ ఫుడ్స్‌ ఇండియా లిమిటెడ్‌ చేపట్టిన పబ్లిక్‌ ఇష్యూ విజయవంతమైంది. రూ. 1,120–1,180 ధరల శ్రేణిలో వచ్చిన ఇష్యూ చివరి రోజు గురువారానికల్లా 6.6 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌ అయ్యింది. ఐపీవోలో భాగంగా కంపెనీ 96,63,468 షేర్లను ఆఫర్‌ చేయగా.. 6.39 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్‌ దాఖలయ్యాయి. తద్వారా కంపెనీ రూ. 2,073 కోట్లు సమకూర్చుకోనుంది.

అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్‌) విభాగంలో 7.5 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల కోటాలో 3.46 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు సైతం 8.7 రెట్లు అధికంగా బిడ్స్‌ వేశారు. సోమవారం యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 933 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. మొత్తం 1.75 కోట్ల షేర్ల వరకూ విక్రయానికి ఉంచింది.  

గో ఫ్యాషన్‌ రెడీ
ఈ నెల 17 నుంచి గో ఫ్యాషన్‌ ఇండియా లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ ప్రారంభంకానుంది. గో కలర్స్‌ బ్రాండుతో మహిళా దుస్తులను తయారు చేస్తున్న కంపెనీ తద్వారా రూ. 800 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ఇష్యూ 22న ముగియనుంది. ఐపీవోలో భాగంగా రూ. 125 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. మరో 1.28 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచనుంది.

మరిన్ని వార్తలు