సోషల్ మీడియాపై సత్య నాదెళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు

11 Feb, 2021 18:47 IST|Sakshi

మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల సోషల్ మీడియాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా సంస్థలు వివాదాస్పద వ్యాఖ్యలు, ఖాతాలకు సంబంధించి కొన్ని కఠినమైన, స్పష్టమైన చట్టాలను తీసుకొనిరావాలి పేర్కొన్నారు. "ప్రధానంగా ప్రజాస్వామ్య దేశాలలో సోషల్ మీడియా సంస్థలు ఏకపక్షంగా వ్యవహరించకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అసత్య, హింస ప్రేరేపిత ఖాతాలకు సంబందించిన విషయంలో కచ్చితంగా కఠినమైన చట్టాలు, నిబంధనల రూపొందించాలని" బ్లూమ్‌బెర్గ్ టెలివిజన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్య నాదెళ్ల పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు