Satya Nadella : ఇక్కడ విండోస్‌.. అక్కడ టీమ్‌..

26 Jan, 2022 17:08 IST|Sakshi

స్మార్ట్‌ఫోన్లు జన జీవితంలోకి ఎంతగా చొచ్చుకువచ్చినా.. ఆకాశమే హద్దుగా గూగుల్‌ ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ దూసుకుపోతున్నా.. చాపకింద నీరులా మాక్‌పాడ్‌ ప్రపంచాన్ని చుట్టేస్తున్నా... ఇప్పటికీ కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌లకు విండోస్‌ సాఫ్ట్‌వేర్‌లే ప్రధాన అండ. విండోస్‌ 8 ఓస్‌ నుంచి మైక్రోసాఫ్ట్‌ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది,. ఐప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అందరి నమ్మకం ఇంకా మైక్రోసాఫ్ట్‌ - విండోస్‌ మీదనే ఉంది. తాజాగా మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల చెప్పిన వివరాలే అందుకు తార్కాణం. 

విండోస్‌ యూజర్లు
ప్రపంచ వ్యాప్తంగా 140 కోట్ల మంది విండోస్‌ 10, విండోస్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ ఉపయోగిస్తున్నట్టు మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యానాదెళ్ల వెల్లడించారు. ఇందులో ఫస్ట్‌, థర్డ్‌ పార్టీవి కూడా ఉన్నాయని వెల్లడించారు. విండోస్‌ 10తో పోల్చితే విండోస్‌ 11 వేగం మూడింతలు ఎక్కువ అని తెలిపారు. వీటిని మినహాయిస్తే విండోస్‌ 7,  విండోస్‌ 8లపై కూడా ఇదే సంఖ్యలో యూజర్ల ఉంటారని అంచనా. దీంతో ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత ఎక్కువగా ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌గా విండోస్‌ నిలిచింది. 

టీమ్‌దే ఆధిపత్యం
ఇక కోవిడ్‌ సంక్షోభం తర్వాత వర్చువల్‌ మీటింగ్స్‌ సర్వసాధారణం అయ్యాయి. అనేక రకాల యాప్‌లు జనం నోళ్లలో నానుతున్నాయి. అయితే బిజినెస్‌ వరల్డ్‌ మాత్రం వర్చువల్‌ మీటింగ్స్‌కి ఎక్కువగా మైక్రోసాఫ్ట్‌కి చెందని టీమ్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు. సత్య నాదెళ్ల తెలిపిన వివరాల ప్రకారం ఫార్చున్‌ 500 కంపెనీల్లో 90 శాతం టీమ్‌పైనే ఆధారపడుతున్నాయి. 

చదవండి:భవిష్యత్తులో ఇవే కీలకమన్న సత్య నాదెళ్ల

మరిన్ని వార్తలు