Reliance AGM 2021: బోర్డులో స్వతంత్ర డైరక్టర్‌గా ఆరాంకో చైర్మన్‌..!

24 Jun, 2021 16:06 IST|Sakshi

ముంబై: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 44వ ఏజీఎం సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో భారీ ప్రకటనలు ఉంటాయని వ్యాపార నిపుణులు చెప్పినట్లుగానే జరిగింది. సమావేశం మొదలుకాగానే కోవిడ్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయిన రిలయన్స్‌ సిబ్బంది, షేర్‌ హోల్డర్లు, వారి కుటుంబ సభ్యులను నిమిషంపాటు మౌనం పాటించారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా  భారత్‌ సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ తెలిపారు.

కోవిడ్‌ మహమ్మారి ఉన్నప్పటికీ గత ఎజీఎం సమావేశం నుంచి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వ్యాపార పనితీరులో,  అంచనాలను మించిపోయాయి. కంపెనీ వ్యాపార పనితీరు కంటే కోవిడ్‌ సమయంలో రిలయన్స్‌ కంపెనీ సేవ కార్యక్రమాలు నాకు ఎక్కువ ఆనందాన్ని కల్గించిందని ముఖేష్‌ అంబానీ పేర్కొన్నారు. రిలయన్స్‌ కంపెనీ ప్రపంచంలో ఏ కంపెనీ చేయలేని విధంగా సుమారు 44.4 బిలియన్‌ డాలర్ల మూలధనాన్ని సేకరించిందని తెలిపారు.

సౌదీ అరాంకో ఛైర్మన్, పిఐఎఫ్ గవర్నర్ యాసిర్ అల్-రుమయ్యన్ స్వతంత్ర డైరెక్టర్‌గా రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో చేరనున్నట్లు అంబానీ ప్రకటించారు. ఆరాంకో చైర్మన్‌ రాక రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అంతర్జాతీయీకరణకు నాంది అని ముఖేష్‌ తెలిపారు. ఆరాంకో సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో వూహత్మాక భాగస్వామిగా కొనసాగనుంది. సంవత్సర ప్రారంభంలో తీవ్రమైన ఆర్థిక ఒడిదుడుకులతో  కంపెనీ ఆయిల్‌ టూ కెమికల్స్‌( O2C) వ్యాపారం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొందని అంబానీ చెప్పారు. ఐనా రిలయన్స్‌ నిలకడగా ఉందని ముఖేష్‌ అంబానీ పేర్కొన్నారు.

చదవండి: Reliance AGM: లక్ష కోట్లతో భారీ ఒప్పందం..!

మరిన్ని వార్తలు