Musk-Twitter: సౌదీ యువరాజు ట్యూన్‌ ఇలా మారిందేంట‌బ్బా!

6 May, 2022 10:06 IST|Sakshi

సౌదీ అరేబియా యువరాజు అల్వలీద్ బిన్ తలాల్ ట్యూన్‌ మారింది. మస్క్‌ ట్విటర్‌ కొనుగోలును తిరస్కరించిన ఆయన ఇప్పుడు మాట మార‍్చారు. ఎలన్‌ మస్క్‌ తనకు మంచి స్నేహితుడంటూ ట్విట్‌ చేశారు. 


ట్విటర్‌ కొత్త బాస్‌ ఎలన్‌ మస్క్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో 44బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.3.37లక్షల కోట్లు) సోషల్‌ మీడియా నెట్‌వర్క్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసింది. అయితే ట్విటర్‌ కొనుగోలును ఆ సంస్థలో ఎక్కువ షేర్లున్న  అల్వలీద్‌ బిన్‌తలాల్‌ మస్క్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. సీన్‌ కట్‌ చేస్తే మస్క్‌ తనకు మంచి మిత్రుడంటూ ట్విట్‌ చేశారు. 

ఎలన్‌ మస్క్‌ ట్విటర్‌ను 44 బిలియన్‌ డాలర్లు కొనుగోలు చేశారు. కానీ వాస్తవానికి మస్క్‌ దగ్గర అంత పెద్దమొత్తం లేదు. దీంతో మస్కే టెస్లా షేర్లను కొనుగోలు చేయడంతో పాటు, ట్విటర్‌లో ప్రపంచ దేశాలకు చెందిన ఇన్వెస్టర్లు పెట్టుబడలు పెట్టొచ్చంటూ పిలుపునిచ్చాడు. అంతే మస్క్‌ పిలుతో పలువురు ఇన్వెస్టర్లు ఆయన అడిగనంత ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. విచిత్రం ఏంటంటే మస్క్‌ ట్విటర్‌ కొనుగోలు వ్యతిరేకించిన ప్రిన్స్‌ అల్వలీద్‌ బిన్‌ తలాల్‌ కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయనే స్వయంగా.. "గ్రేట్‌ టూ కనెక్ట్‌ విత్‌ యూ మై న్యూ ఫ్రెండ్‌" అంటూ ట్వీట్‌ చేశారు.    

ఐ బిలీవ్..నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. ట్విటర్ సామర్థ్యాన్నిపెంచే గొప్ప నాయకుడని అర్ధం వచ్చేలా ట్విట్‌లో పేర్కొన్నారు. అంతేనా నా సంస్థ (కింగ్‌డమ్‌ హోల్డింగ్‌ కంపెనీ) 1.9 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టి ట్విటర్‌తో కొత్త జర్నీని ప్రారంభించేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నామని స్పష్టం చేశారు.

 ఎలన్‌ మస్క్‌ ఆఫర్‌ రిజెక్ట్‌
గత నెలలో మస్క్ ట్విట్టర్ షేర్‌హోల్డర్‌లను ఒక్కో షేరుకు 54.20డాలర్ల చొప్పున కొనుగోలు చేసేందుకు ఆఫర్‌ను ప్రకటించారు. ఆ ప్రకటన చేసిన కొద్ది సేపటికే అల్వలీద్‌ బిన్‌ తలాల్‌.. మస్క్‌ ప్రతిపాదించిన ఆఫర్‌ను తిరస్కరిస్తున్నాని మస్క్‌కు రీట్విట్‌ చేశారు.

చదవండి👉సంచ‌ల‌నం! ట్విట‌ర్‌ను కొనుగోలు చేసిన ఎల‌న్ మ‌స్క్‌!

మరిన్ని వార్తలు