Savitri Jindal: కలిసొచ్చిన అదృష్టం: ఆసియా రిచెస్ట్‌ విమెన్‌గా సావిత్రి జిందాల్‌ రికార్డు

30 Jul, 2022 15:51 IST|Sakshi

ఆసియా రిచెస్ట్‌ విమెన్‌గా సావిత్రి జిందాల్‌ 

ఆసియా సంపన్న మహిళగా ఉన్న యాంగ్ హుయాన్‌ను స్థానంలో సావిత్రి జిందాల్‌

సాక్షి, ముంబై: ఆసియాలోనే అత్యంత సంపన్న మహిళగా  జిందాల్ గ్రూప్ చైర్‌పర్సన్‌  సావిత్రి జిందాల్ నిలిచారు. ఇప్పటిదాకా ఆసియా సంపన్న మహిళగా ఉన్న యాంగ్ హుయాన్‌ను స్థానంలో సావిత్రి ముందుకు దూసుకొచ్చారు. చైనాలో రియల్ ఎస్టేట్ సెక్టార్‌ తీవ్ర సంక్షోభంలో పడిపోవడంతో  చైనీస్ రియల్ ఎస్టేట్ దిగ్గజం కంట్రీ గార్డెన్  మేజర్‌ వాటాదారురాలైన యాంగ్‌ సంపద ఈ ఏడాది సగం సంపదహారతి కర్పూరంలా కరిగిపోవడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే యాదృచ్చికంగా 2005 లోనే (తండ్రినుంచి యాంగ్‌, భర్త అకాలమరణంతో సావిత్రి  జిందాల్‌) ఇద్దరూ వ్యాపార బాధ్యతలను  చేపట్టడం విశేషం. 

11.3 బిలియన్ల డాలర్ల నికర విలువతో 72 ఏళ్ల జిందాల్ భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళ  రికార్డు దక్కించుకున్నారు. 18 బిలియన్ల డాలర్ల నికర విలువతో 2021లో ఫోర్బ్స్ అత్యంత సంపన్న భారతీయుల జాబితాలో చోటు సంపాదించారు సావిత్రి జిందాల్‌. అంతేకాదు దాదాపు 1.4 బిలియన్‌ డాలర్లతో  దేశంలో టాప్‌-10లో ఉన్న ఏకైక మహిళ కూడా.

2005లో భర్త ఓం ప్రకాష్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత సావిత్రి జిందాల్ జిందాల్ గ్రూపు పగ్గాలను చేపట్టవలసి వచ్చింది. ఆమె నాయకత్వంలో ఆదాయం నాలుగు రెట్లు పెరిగింది. ఇటీవలి సంవత్సరాలలో జిందాల్ నికర విలువ విపరీతంగా హెచ్చుతగ్గులకు లోనైంది. ముఖ్యంగా కోవిడ్-19 కారణంగా 2020 ఏప్రిల్‌లో 3.2 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. కానీ ఉక్రెయిన్‌పై రష్యా దాడి తరువాత వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో 2022 ఏప్రిల్‌ నాటికి 15.6 బిలియన్ల డాలర్లకు చేరుకుందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఆమె ఎప్పుడూ కాలేజీకి వెళ్లలేదని చెబుతారు. అయినప్పటికీ జిందాల్‌ గ్రూపు వ్యాపారాన్ని విస్తరించి ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో టాప్ 13 మహిళా బిలియనీర్‌లలో ఒకరిగా నిలిచారు.

కాగా 1950లో మార్చి 20న అస్సాంలోని టిన్సుకియా పట్టణంలో జన్మించిన సావిత్రి 1970లలో ఓపీ జిందాల్‌ను  వివాహం చేసుకున్నారు. విజయవంతమైన వ్యాపారవేత్తగానే కాకుండా, భూపీందర్ సింగ్ ప్రభుత్వంలో హర్యానా మంత్రిగా కూడా సావిత్రిజిందాల్‌ పాపులర్‌. హిసార్ నియోజకవర్గం నుంచి హర్యానా విధానసభకు ఎన్నికయ్యారు. కానీ 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

కాగా 2005లో చైనాలోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలో తన తండ్రి వాటాను వారసత్వంగా పొంది ఈ గ్రహం మీద  ఎక్కువ సంపద గల అత్యంత పిన్న వయస్కుల్లో ఒకరిగా నిలిచారు యాంగ్ హుయాన్. 20215 దాదాపు 24 బిలియన్ డాలర్లతో ఆసియాలోనే రిచెస్ట్‌ మహిళగా నిలిచింది. అయితే గత ఐదేళ్లుగా ఆసియాలోనే అత్యంత సంపన్న మహిళగా నిలిచిన యాంగ్‌ సంపద ప్రస్తుతం 11.3 బిలియన్ డాలర్లకు పడిపోయిందని బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ పేర్కొంది. దీంతో బిలియనీర్ ఇండెక్స్‌లో టాప్‌ర్యాంక్‌ను కోల్పోయారు. 2005లో యాంగ్‌ తండ్రి వాటాను వారసత్వంగా  స్వీకరించి ఈ గ్రహం మీద అత్యంత ధనవంతురాలైన పిన్న వయస్కుల్లో ఒకరిగా నిలిచారు.

మరిన్ని వార్తలు