ఎస్‌బీఐ అలర్ట్‌: ఈ మూడు గంటలపాటు ఇంటర్నెట్‌ బ్యాకింగ్‌, యోనో పని చేయవు

4 Sep, 2021 15:17 IST|Sakshi

తన ఖాతాదారులను అప్రమత్తం చేస్తూ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్‌ 4, 5 తేదీల మధ్య మూడు గంటలపాటు అన్ని డిజిటల్‌ సర్వీసులకు విఘాతం కలగనున్నట్లు తెలిపింది.

సెప్టెంబర్‌ 4వ తేదీ(ఇవాళ రాత్రి) రాత్రి 10.35 నుంచి అర్ధరాత్రి దాటాక 1గం.30ని. వరకు డిజిటల్‌ సర్వీసులు పని చేయవని తెలిపింది ఎస్‌బీఐ. ఈ మూడు గంటలపాటు ఎస్బీఐ ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యోనో యాప్‌, యోనో లైట్‌, యోనో బిజినెస్‌, ఐఎంపీఎస్‌, యూపీఐ సర్వీసులేవీ పని చేయవని తెలిపింది. మెరుగైన సేవలు అందించడం కోసం చేసే మెయింటెనెన్స్‌ కారణంగానే అంతరాయం కలగనుందని, యూజర్లు ఇది గమనించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శుక్రవారం ట్వీట్‌ ద్వారా విషయం వెల్లడించిన స్టేట్‌బ్యాంక్‌.. ఈ ఉదయం మరోసారి కస్టమర్లను అప్రమత్తం చేసింది.

గత కొంతకాలంగా ఎస్బీఐ సర్వీసులపై ఖాతాదారుల్లో, డిజిటల్‌సేవలపై యూజర్లలో అసహనం నెలకొంటోంది. యోనో యాప్‌ సరిగా పని చేయకపోవడంతో ఫిర్యాదులతో పాటు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఖాతాదారులకు క్షమాపణలు చెబుతూనే.. యూజర్లకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రయత్నిస్తున్నామని, ఖాతాదారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఫీడ్‌బ్యాక్‌ రూపంలో వివరంగా ఇవ్వొచ్చని చెబుతోంది ఎస్బీఐ.

చదవండి: రిటైల్‌ సర్వీస్, ప్రాసెసింగ్‌ చార్జీల ఎత్తివేత

మరిన్ని వార్తలు