వచ్చే నెల్లో ఎస్‌బీఐ ఎన్‌పీఏ అకౌంట్ల వేలం 

7 Jul, 2021 15:17 IST|Sakshi

రెండు ఖాతాల ద్వారా రూ.313 కోట్ల వసూళ్లు

న్యూఢిల్లీ: ప్రభుత్వ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) వచ్చే నెల్లో రెండు మొండి బకాయి (ఎన్‌పీఏ) పద్దులను వేలం వేయనుంది. రూ.313 కోట్లకుపైగా వసూళ్లు ఈ వేలం లక్ష్యమని బ్యాంక్‌ విడుదల చేసిన ఒక నోటీస్‌ వివరించింది. రెండు ఖాతాలనూ ఆగస్టు 6న ఈ–ఆక్షన్‌ వేయనున్నట్లు నోటీస్‌ పేర్కొంది.

భద్రేశ్వర్‌ విద్యుత్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బీవీపీఎల్‌) ఎన్‌పీఏ వేలం ద్వారా రూ .262.73 కోట్లు,  జీఓఎల్‌ ఆఫ్‌షోర్‌ లిమిటెడ్‌ ఖాతా వేలంతో రూ.50.75 కోట్ల బకాయిలను రాబట్టుకోవడం బ్యాంక్‌ లక్ష్యం. రెండు సంస్థలకు సంబంధించి వేలం రిజర్వ్‌ ధరలు వరుసగా రూ.100.12 కోట్లు. రూ.50 కోట్లుగా ఉన్నాయి.    

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు