ఎస్‌బీఐ ఖాతాదారులకు ముఖ్య గమనిక!

1 Sep, 2022 18:59 IST|Sakshi

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ నెల నుంచి కొత్త డెబిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డు నిబంధనల్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. తద్వారా రోజురోజుకి పెరిగిపోతున్న సైబర్‌ మోసాలు, యూజర్ల వ్యక్తిగత వివరాల్ని దొంగిలించడం లాంటి ఘటనల్ని తగ్గించవచ్చని భావిస్తోంది.  

ఆర్బీఐ ఆదేశాల మేరకు..2020 మార్చి నెలలో ఎస్‌బీఐ తన కస్టమర్లకు, ఉద్యోగులు, స్టాక్‌ హోల్డర్లకు  ప్రపంచ స్థాయిలో సర్వీసులు, లావాదేవీల కోసం​ ప్యూర్‌ ప్లే క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగంలోకి తెచ్చింది. ఇప్పుడు ఆ కార్డులను టోకనైజేషన్‌ చేయనుంది. నిబంధనలకు లోబడి తయారీ, సంసిద్ధత, సాంకేతికత వారీగా,ఇంటిగ్రేషన్ కోసం ఫైనాన్షియల్‌ సర్వీస్‌ సంస్థలైన వీసా,మాస్టర్‌ కార్డు,రూపేలతో జతకట్టనున్నట్లు ఎస్‌బీఐ కార్డ్స్‌ ఎండీ,సీఈవో రామ‍్మోహన్‌ రావు అమర తెలిపారు.       

డెడ్‌ లైన్‌ పొడిగింపు 
కార్డు టోకనైజేషన్‌పై రామ‍్మోహన్‌ రావు మాట్లాడుతూ.. "వినియోగదారుల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని టోకనైజేషన్‌ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాం. సైబర్‌ నేరస్తులు వారి వ్యక్తిగత వివరాల్ని దొంగిలించకుండా ఉంచేందుకు ఈ టోకనైజేషన్‌ వ్యవస్థ ఉపయోగపడుతుంది. కస్టమర్లు, వాటాదారుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ఆర్బీఐ కార్డ్ ఆన్ ఫైల్ (సీఓఎఫ్‌) టోకనైజేషన్ గడువును 3నెలల పాటు సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు చెప్పారు. అంతకుముందు ఆ గడువు జూన్ 30 వరకే ఉంది.

మరిన్ని వార్తలు