SBI Mortgage Properties sale: అతి తక్కువ ధరకే ఇళ్లను సొంతం చేసుకోండిలా

14 Oct, 2021 17:06 IST|Sakshi

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. అక్టోబర్‌ 25న దేశ వ్యాప్తంగా నిర్వహించే ఈ-ఆక్షన్‌లో పాల్గొన వచ్చని తెలిపింది. సాధారణంగా అత్యవసర లోన్‌ కోసం బ్యాంక్‌లో ఆస‍్తుల్ని చూపెట్టి..వాటి ఆధారంగా లోన్‌ తీసుకునే అవకాశం ఉంటుంది. వాటినే మాటిగేజ్‌ లోన్‌ అంటారు. ఒకవేళ తీసుకున్న లోన్‌ తీర్చలేని పక్షంలో సంబంధిత బ్యాంక్‌లు మాటిగేజ్‌లో ఉన్న ఆస్తుల్ని వేలం వేస్తాయి. ఇప్పుడు ఎస్‌బీఐ కూడా అదే చేస్తోంది.

ఈ నెలలో దేశ వ్యాప్తంగా మాటిగేజ్‌ లోన్లపై ఉన్న ఆస్తులపై ఈ-వేలం నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.ఈ-వేలంలో మాటిగేజ్‌ ఇళ్లు, ప్లాట్లు, కమర్షియల్‌ స్పేస్‌లను ప్రస్తుత మార్కెట్ కంటే తక్కువకే సొంతం చేసుకోవచ్చని ట్వీట్‌లో పేర్కొంది. 

మాటిగేజ్‌లో పాల్గొనేందుకు కావాల్సిన రిక్వైర్‌మెంట్స్‌

► ఈ - ఆక్షన్‌లో పాల్గొనే వారికి ఈఎండీ (Earnest Money Deposit) తప్పసరిగా ఉండాలని ఎస్‌బీఐ పేర్కొంది. 

► కేవైసీ డాక్యుమెంట్లను సంబంధిత ఎస్ బీఐ  బ్రాంచ్లో సబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది. 

► వ్యాలిడ్‌ డిజిటల్‌ సిగ్నేచర్‌ తప్పని సరిగా కావాలి. ఇందుకోసం ఆక్షన్‌లో పాల్గొనే వారు డిజిటల్‌ సిగ్నేచర్‌ కోసం ఎస్‌బీఐ బ్రాంచ్‌  అధికారుల్ని సంప‍్రదించాల్సి ఉంటుంది.  లేదంటే ఏజెన్సీలను ఆశ్రయించవచ్చు.

► ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ఈఎండీ, కేవైసీ డాక్యుమెంట్లను సబ్మిట్‌ చేసిన తర్వాత వేలంలో పాల్గొనే బిడ్డర్లకు అధికారిక మెయిల్‌కు లాగిన్ ఐడి, పాస్‌వర్డ్‌లను పంపిస్తారు. అనంతరం వేలం నిబంధనల ప్రకారం ప్రకటించిన తేదీల్లో ఇ-వేలంలో పాల్గొనాలి 

ఎస్ బీఐ ఈ-ఆక్షన్‌లో ఎలా పాల్గొనాలి 

► అధికారిక బిడ్డింగ్ పోర్టల్‌ను విజిట్‌ చేసి మీ అడ్రస్‌ ఫ్రూప్‌తో పాటు మెయిల్‌ ఐడీకి సెండ్‌ చేసిన పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి

► లాగిన్‌ అయిన తర్వాత నిబంధనలు, షరతుల్ని అంగీకరించి 'పార్టిసిపేట్' అనే బటన్‌పై క్లిక్ చేయండి.

► అవసరమైన కేవైసీ పత్రాలు, ఈఎండీ వివరాలు, ఎఫ్‌ఆర్‌క్యూ (మొదటి రేటు కోట్) ధరను అప్‌లోడ్ చేయాలి.

► పత్రాలను సమర్పించిన తర్వాత, కోట్ ధరను సమర్పించాలి. ఆస్తి లేదా ఆస్తి యొక్క రిజర్డ్వ్‌ విలువకు సమానంగా లేదా ఎక్కువగా ఉంటుంది.

► అవసరమైన వివరాలను, కోట్ ధరను పూర్తి చేయాలి. ఆపై సబ్మిట్‌ చేసి ఆ తర్వాత చివరిగా  బటన్‌ పై క్లిక్ చేయండి.  

చివరిగా 'బ్రాంచ్‌లలో వేలం కోసం నియమించబడిన అధికారి ఉంటారు. వేలంలో పాల్గొనే వారు ఎవరైనా సరే  వేలం ప్రక్రియ, లేదంటే ఈవేలంలో కొనుగోలు చేసే ఆస్తుల్ని   తనిఖీ చేయాలంటే అధికారిని సంప్రదించవచ్చని' ఎస్‌బీఐ తెలిపింది.

చదవండి: SBI: టాక్స్‌ పేయర్లకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌...!

మరిన్ని వార్తలు