ఎస్‌బీఐ నిధుల సమీకరణ - బాండ్ల జారీతో రూ. 10,000 కోట్లు

23 Sep, 2023 07:35 IST|Sakshi

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ బాండ్ల జారీ ద్వారా రూ. 10,000 కోట్లు సమకూర్చుకుంది. 7.49 శాతం కూపన్‌ రేటుతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్లను జారీ చేసినట్లు వెల్లడించింది. వెరసి ఎస్‌బీఐ నాలుగోసారి ఇన్‌ఫ్రా బాండ్ల జారీని చేపట్టగా.. నిధులను మౌలిక సదుపాయాలు, అందుబాటు ధరల గృహ నిర్మాణ ప్రాజెక్టులకు కేటాయించనుంది. 

నిజానికి ఎస్‌బీఐ రూ. 4,000 కోట్లు సమీకరించేందుకు బాండ్ల ఇష్యూకి తెరతీసింది. అయితే ఐదు రెట్లు అధికంగా అంటే రూ. 21,045 కోట్ల విలువైన 134 బిడ్స్‌ దాఖలయ్యాయి. 

ప్రావిడెండ్‌ ఫండ్స్, పెన్షన్‌ ఫండ్స్, బీమా కంపెనీలు, మ్యూచువల్‌ ఫండ్స్‌ తదితరాల నుంచి సబ్‌స్క్రిప్షన్‌ లభించినట్లు ఎస్‌బీఐ పేర్కొంది. ఇక ఇదే మార్గంలో ఆగస్ట్‌లోనూ బ్యాంక్‌ రూ. 10,000 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత ఇష్యూతో కలిపి మొత్తం రూ. 39,718 కోట్ల విలువైన దీర్ఘకాలిక బాండ్లను జారీ చేసినట్లయ్యింది.

మరిన్ని వార్తలు