గోల్డ్‌ లోన్స్‌: ఎస్‌బీఐ సరికొత్త రికార్డు 

2 Jul, 2022 11:09 IST|Sakshi

ఎస్‌బీఐ..లక్ష కోట్ల బంగారు రుణాలు 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పుత్తడి రుణాల్లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నూతన రికార్డు సృష్టించింది. రూ.1 లక్ష కోట్ల బంగారు రుణాలను మంజూరు చేసి సరికొత్త మైలురాయిని అధిగమించింది. గోల్డ్‌ లోన్‌ విభాగంలో భారత్‌లో సంస్థకు 24 శాతం మార్కెట్‌ వాటా ఉందని ఎస్‌బీఐ చైర్మన్‌ దినేశ్‌ ఖరా వెల్లడించారు.

క్రితంతో కంటే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో బంగారు రుణాల్లో మెరుగైన వృద్ధి నమోదు చేసినట్టు తెలిపారు. ద్రవ్యోల్బణ పరిస్థితుల దృష్ట్యా రుణం పొందే విషయంలో పుత్తడి మరింత ప్రాధాన్యత కలిగిన ఆస్తిగా మారుతుందన్నారు. ఈ విభాగంలో పెద్ద ఎత్తున వ్యాపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. 2021-22లో రిటైల్‌ లోన్స్‌ విభాగం 15 శాతం వృద్ధి సాధించిందని వెల్లడించారు.  ఆర్థిక వ్యవస్థకు కావాల్సిన అన్ని రకాల వృద్ధి అవసరాలను తీర్చగల స్థితిలో బ్యాంక్‌ ఉందని ఖరా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు